ETV Bharat / entertainment

'తెలుగుదేశంలో చేరొచ్చు కదా? కొత్త పార్టీ ఎందుకు?'.. పవన్​కు బాలయ్య సూటి ప్రశ్న - ఎన్​బీకే పీఎస్​పీకే ఎపిసోడ్ పార్ట్​ 2

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో బాలకృష్ట టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' రెండో ఎపిసోడ్​ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో పవన్​ను బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.

unstoppable with nbk pawan kalyan episode

author img

By

Published : Feb 5, 2023, 6:50 PM IST

Updated : Feb 5, 2023, 8:56 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఇటీవల ఈ షోకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన తొలి భాగం విడుదలైంది. త్వరలోనే రెండో భాగాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. ఈ ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు. తెలుగుదేశంలో చేరొచ్చు కదా? కొత్త పార్టీ ఎందుకు? అని పవన్​ను ప్రశ్నించారు బాలయ్య. "సినిమాలను పూర్తిగా వదిలేసి.. రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేస్తారు" అని అడిగారు. వాటితోపాటు పవన్​ను బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.

'నాకు తిక్క వచ్చింది..'
బాప్​ ఆఫ్​ ఆల్​ ఎపిసోడ్స్​గా ఆహా ఎప్పటి నుంచో ఈ ఎపిసోడ్​ను ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే అన్​స్టాపబుల్​ పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​ ఒకటో భాగం సూపర్​ హిట్​ అయ్యింది. పలు రికార్డులు బద్దలుగొట్టిందని తెలుస్తోంది. కాగా, మొదటి ఎపిసోడ్​ మంచి కిక్​ ఇచ్చింది. ఇప్పుడీ ఎపిసోడ్​ అంతకు మించి ఉండబోతోందని అనిపిస్తోంది. ఈ పార్ట్​-2లో బాలకృష్ణ రాజకీయాలు ప్రధానంగా.. పవన్​పై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు.. గతేడాది పవన్​ను ఓ పర్యటనలో పోలీసులు ఆపేస్తే.. జనసేనాని కారుపై ఎక్కారు. ఆ ఫొటోను చూపిస్తూ ' ఏమిటి ఆ గొడవ ' అని అడిగారు బాలయ్య. దానికి పవన్​..'కారులో వెళ్ల కూడదు, కారు నుంచి బయటకు రాకూడదు, రూమ్​లో ఉండకూడదు, అందులోంచి బయటకు రాకూడదు.. అందుకే కొన్ని రోజుల తర్వాత నాకు తిక్క వచ్చింది' అని అన్నారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసి' అంటూ.. ఘాటుగా స్పందించారు.

'టీడీపీలో చేరొచ్చు కదా'
'సంభాషణలో మధ్యలో పార్టీ స్థాపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది' అని బాలకృష్ణ సీరియస్​ ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా..' చాలా మంది ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతారు.. కానీ ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడరు' అని పవన్ జవాబిచ్చారు. ఆ తర్వాత.. 'నువ్వు తెలుగుదేశం పార్టీలో జాయిన్​ కావొచ్చు అంటూ' సంచలన ప్రశ్న సంధించారు బాలయ్య. దీంతో వాతావరణం అంతా వెడెక్కింది.

'సీఎం అయిన తర్వాత చనిపోతా'
బాలయ్య వేసిన ఓ ప్రశ్నకు పవన్​ సీరియస్​గా సమాధానమిచ్చారు. 'ఎదగనివ్వకపోవడం అనేది.. వాడి వ్యూహంలో ఒక భాగం అంతే ' అని సీరియస్​ టోన్​లో అన్నారు. 'అటెంప్ట్​ మర్డర్​ కేసు పెట్టారని పవన్'​ చెప్పారు. దీంతో ఈ ఎపిసోడ్​లో పవన్​ కల్యాణ్​​ మరిన్ని అసక్తికర విషయాలు బయటపెడతారని అభిమానులు అనుకుంటున్నారు. కాగా, ఈ షోకు ఓ వృద్ధ మహిళ వచ్చింది. అనంతరం కరోనా వచ్చి నా కుమారుడు చనిపోయాడని.. ఇప్పుడు పవనే​​ నా కుమారుడని చెప్పింది. పవన్​ కల్యాణ్​​ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చనిపోతానని వెల్లడించింది. దీంతో ఆమె పాదాలకు పవన్​ నమస్కరించారు.

'సింహం పులి మధ్యలో నా తల ఉంది'
అయితే, ఈ షోకు డైరెక్టర్​ క్రిష్​ కూడా వచ్చాడు. దీంతో ఆయన్ను బాలయ్య.. ' ఇద్దరితో పని చేశావు కదా.. డిఫరెన్స్ ఏంటి' అని అడిగారు. దీనికి క్రిష్​ స్పందిస్తూ.. 'ఒక సింహం.. ఓ పులి మధ్యలో నా తల ఉంది' అని అన్నారు. అనంతరం మోస్ట్ ఇంట్రెస్టింగ్​ క్వశ్చన్​ అడిగారు బాలయ్య.. 'సినిమాలు మానేసి ప్రజాసేవకే ఇంపార్టెన్స్​ ఇవ్వాలి' అని పవన్​ను అడిగారు. అయితే, ఈ ప్రశ్నకు పవన్​ సమాధానం తెలియాలంటే.. ఫిబ్రవరి పదో తేది వరకు ఆగాల్సిందే. ఇక చివరగా ' అణువును కూడా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది' అంటూ బాలయ్య పవర్​ ప్యాక్డ్​ డైలాగ్​ చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Feb 5, 2023, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.