ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్.. 'ఆదిపురుష్'​ నుంచి ఫస్ట్​ సింగిల్​తో పాటు.. - ఆదిపురుష్​ సినిమా రిలీజ్​ డేట్​

రెబల్​స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న పాన్​ ఇండియా మూవీ 'ఆదిపురుష్'​ నుంచి ఫస్ట్ సింగిల్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. ఈ క్రమంలో ఓ లిరికల్​ వీడియోను అభిమానుల కోసం అప్​లోడ్​ చేసింది. దీన్ని చూసిన ప్రభాస్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

adipurush first single
adipurush first single
author img

By

Published : Apr 22, 2023, 9:10 AM IST

Updated : Apr 22, 2023, 9:57 AM IST

రెబల్​స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న పాన్​ ఇండియా మూవీ 'ఆదిపురుష్'​ నుంచి ఫస్ట్ సింగిల్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. ఈ క్రమంలో ఓ లిరికల్​ వీడియోను అభిమానుల కోసం అప్​లోడ్​ చేసింది. 'నీ సాయం సదా మేమున్నాం' అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. హనుమాన్​ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించిన ఆడియో సాంగ్​ను హనుమంతుని పోస్టర్​ పెట్టి హిందీలో రిలీజ్​ చేశారు.

అయితే ఇప్పుడు ఇదే పాటను లిరికల్​ వీడియో రూపంలో మలిచి.. సినిమా రిలీజవుతున్న అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. వీడియో ఆఖరిలో శ్రీ రాముని కొత్త పోస్టర్​ను రివీల్​ చేసింది మూవీ టీమ్​. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్​ అందించిన ఈ పాటకు బాలీవుడ్​ స్టార్​ మ్యూజిక్​ కాంబో అజయ్.. అతుల్ సంగీతాన్ని సమకూర్చారు.

రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ రామునిగా పాత్రలో ప్రభాస్​ నటించగా.. సీతమ్మ తల్లి పాత్రలో కృతి సనన్​ నటిస్తున్నారు. లక్ష్మణుని పాత్రలో బాలీవుడ్​ హీరో సన్నీ సింగ్​ నటించారు. హనుమంతుని పాత్రలో దేవదత్త్ నాగే​ నటించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్​ స్టార్​ సైఫ్​ అలీ ఖాన్​ నటించారు. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా రీసెంట్​గా ఈ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక 'ట్రిబెకా ఫెస్టివల్‌'లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు ఓం రౌత్‌ తెలియజేశారు.

"ఇది గౌరవం, సంతోషానికంటే మించింది. 2023 జూన్‌ 13న 'ఆదిపురుష్' న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని. ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ఓం రౌత్‌ తెలిపారు. ఇక ఈ వేడుక జూన్‌ 7 నుంచి 18 వరకు న్యూయార్క్​లో అట్టహాసంగా జరగనుంది.

జూన్​లో రిలీజవ్వనున్న ఈ సినిమా రన్​టైమ్​ గురించి నెట్టింట్లో తెగ చర్చలు జరిగింది. అయితే ట్రిబెకా అఫీషయల్ వెబ్‌సైట్‌ ద్వారా 'ఆదిపురుష్​' రన్‌టైమ్‌‌ విషయంపై పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ ఫెస్టివల్​లో రిలీజ్​ చేస్తున్న సినిమా ప్రకారం దీని నిడివి 174 నిమిషాలు ఉంటుందని స్పష్టమయ్యింది. అంటే సుమారు 2 గంటల 54 నిమిషాలు. గతంలో ఈ సినిమా రన్‌టైమ్‌పై ఎన్నో రూమర్స్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొదట్లో ఈ టైమ్​ను 3 గంటల 16 నిమిషాలకు ఫిక్స్ చేశారన్న టాక్ కూడా నడిచింది.

Last Updated : Apr 22, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.