ఇంకో రోజులో బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. భారీ బడ్జెట్‌తో రూపొంది.. ఏ మాత్రం సంబంధం లేని రెండు జానర్ల సినిమాలు ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి టాలీవుడ్ నుంచి రానుండగా.. మరొకటి కోలివుడ్ నుంచి రాబోతుంది. అవే స్పై యాక్షన్ థ్రిల్లర్ అఖిల్ 'ఏజెంట్'- హిస్టారికల్ ఎపిక్ మణిరత్నం మల్టీస్టారర్ 'పొన్నియిన్ సెల్వన్-2'. ఇప్పటికే ఈ రెండు చిత్రాల మూవీటీమ్స్.. గత కొద్ది రోజులుగా వినూత్నంగా జోరుగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్‌లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పైగా టాలీవుడ్లో ఈ రెండు చిత్రాలకు పెద్దగా పోటీకూడా ఏమీ లేవు. రీసెంట్గా వచ్చిన సాయి తేజ్ సూపర్ హిట్ చిత్రం 'విరూపాక్ష' ఒక్కటి మాత్రమే ఉంది. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. 'విరూపాక్ష' వీటికి పెద్ద అడ్డేమి కాదు. మంచి కలెక్షన్లతో దూసుకెళ్తాయి.
అఖిల్ ఏజెంట్ విషయానికొస్తే.. దాదాపు రూ.80కోట్లతో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కాస్త జోరు చూపించినట్లు తెలిసింది. రూ.36.20 కోట్లు బిజినెస్ జరిగిందట. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.37కోట్లు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర పోస్టర్, టీజర్, ట్రైలర్.. ముఖ్యంగా అఖిల్ సిక్స్ ప్యాక్ స్టైలిష్ లుక్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా మొదటగా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి టాలీవుడ్, మాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. బుక్కింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా.. కాస్త హిట్ టాక్ తెచ్చుకుంటే.. రానున్న రోజుల్లో మంచి వసూళ్లను అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం అటు అఖిల్‌తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎంతో కీలకం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక పొన్నియిన్ సెల్వన్ 2 విషయానికొస్తే.. పూర్తి తమిళ వాసనలతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ హిస్టారికల్ సినిమా. చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, ఐశ్వర్యా రాయ్ వంటి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన తొలి భాగం వాస్తవానికి ఆశించిన స్థాయిలో భారీ హిట్‌ను అందుకోలేదనే చెప్పాలి! కేవలం తమిళలు మాత్రమే ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరించారు. అలా ఫస్ట్ పార్ట్ దాదాపు రూ.500కోట్ల వరకు వసూలు చేసింది. ఇక రెండో భాగంపై కూడా వారే ఎక్కువగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ విషయానికొస్తే.. ఇక్కడి వారు.. మొదటి ప్రాధాన్యత ఏజెంట్ లేదా విరూపాక్ష ఇచ్చే అవకాశముంది. ఫస్ట్ డే బాహుబలి అంత కాకపోయినా.. దానికి దగ్గరగా హిట్ టాక్ వస్తేనే.. రానున్న రోజుల్లో ఈ సినిమాపై మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది. ఇక ఓపెనింగ్స్ విషయానికొస్తే.. ఇక్కడ నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేస్తుండటంతో థియేటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దొరికి ఉండొచ్చు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నాయట! ఏదేమైనప్పటికీ ఈ రెండు సినిమాలు ఇక్కడ 'టాలీవుడ్ గన్ వర్సెస్ కోలివుడ్ కత్తి' అన్నట్టుగా ఉంది. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయం సాధిస్తాయో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'పొన్నియిన్ సెల్వన్-2'... ఆమె పగకు కారణాలెన్నో?