రాకెట్ రాఘవ.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక షో 'జబర్దస్త్'. ఈ షోకి ప్రేక్షకాదరణ ఎంత ఉందో అదే రేంజ్ అందులోని టీమ్ లీడర్ రాకెట్ రాఘవకు ఉంది. 2013లో మొదలైన ఈ షో నిర్విరామంగా 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ పోటీ ప్రపంచంలో ఒక కామెడీ షో ఇన్ని ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం సాహసమే. ఈ షోకు వస్తున్న టీఆర్పీ రేటింగ్సే.. ఇందుకు నిదర్శనం. షో మొదలైనప్పటి నుంచి ఎందరో కంటెస్టెంట్లు వచ్చారు.. వెళ్లారు. ఎన్నో టీమ్స్ మారాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏకైక నటుడు రాకెట్ రాఘవ.
కామెడీ టైమింగ్ అద్భుతం..
మాటలు, డైలాగులు, పంచ్‌లతోనే కాదు.. మనిషి హావభావాలతో కూడా కామెడీని పండించొచ్చు అని చార్లీ చాప్లిన్ నిరూపించారు. అదే కోవలో రాఘవ నడిచారు. అలాంటి కామెడీ అందించి.. ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇదే కాకుండా ప్రయోగాలు చేయడంలో కూడా రాఘవ దిట్ట. అనేక పాత్రలకు ఇలా ప్రయోగాలతో ప్రాణం పోశారు. మనిషిని చూస్తేనే నవ్వు గొలిపే విధంగా ఉంటాయి ఆయన హావభావాలు. స్కిట్ చేసేటప్పుడు మిగతా నటులు ఆయన్ను హేళన చేస్తూ పంచులు వేసినా.. స్పోర్టివ్‌గా తీసుకునేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి.. బుల్లితెరపైనే కాకుండా వెండితెర మీద కూడా మెరిశారు. ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు.
జబర్దస్త్ కామెడీ వీరుడు..
జబర్దస్త్‌లో తనకు తిరుగే లేదు అన్నట్లు రాఘవ కొన్ని వందల స్కిట్లు చేశారు. అందుకు తగ్గట్లుగా ఆయన టీమ్ మెంబర్స్ కూడా సహకరించేవారు. కొన్ని స్కిట్లు చేసేటప్పుడు గాయపడిన సందర్భలూ ఉన్నాయి. వాటిని లెక్కచేయ కుండా ప్రేక్షకులకు ప్రేక్షకులకు వినోదం అందించడానికి కష్టపడ్డ క్షణాలూ ఉన్నాయి. ఇలా దెబ్బలను లెక్క చేయకుండా తాము ఫ్యాన్స్‌ను ఎంతగా నవ్వించగలమో ఆలోచిస్తుంటామని ఒకానొక సందర్భంలో ఆయన అన్నారు.
ఎప్పుడూ కొత్తగా..
స్కిట్ కొత్తగా ఉండాలని రకరకాల ప్రయోగాలు చేస్తారు రాఘవ. షోలో అందరూ ఒక్కో రకమైన కామెడీలు చేస్తే.. రాఘవ మాత్రం ఏ రకమైన స్కిట్లైనా చేయగలరు. మిగతా వారు పంచులపైనో.. డ్రామా ఆధారంగానో స్కిట్లు చేస్తారు. రాఘవ చేసే స్కిట్లలో మాత్రం పంచ్‌లు, డ్రామా ఉంటుంది. ఇంకాచెప్పాలంటే.. ఇవేమి లేకపోయినా సోలోగా నవ్వించగల సత్తా ఆయన సొంతం. రాఘవ స్కిట్లో స్టేజి నిండుగా ఉంటుంది. కొన్ని సార్లు రాఘవ ఒక్కరే వన్ మ్యాన్ షో చేసిన స్కిట్లు సందర్భాలున్నాయి. మిగతా నటులను కూడా అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకుంటారు రాఘవ.
ఫ్యామిలీతో కలిసి చూసేలా..
డబుల్ మీనింగ్ డైలాగుల జోలికి వెళ్లకుండా పంచ్‌లు సెటైర్లతో కామెడీ చేశారు రాఘవ. ఆయన స్కిట్లు ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి. రాఘవ.. తన క్లీన్ కామెడీ, అమాయకత్వంతో చిన్నారులను సైతం అలరిస్తారు. సుజాతా అంటూ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఘనత రాఘవది. ఇలా దాదాపు 9 ఏళ్ల పాటు జబర్దస్త్‌లో ఉండటమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల పొందారు రాఘవ. ఈ ఘనత సాధించినందుకు జబర్దస్త్ 500వ ఎపిసోడ్లో జడ్జ్‌లు రోజా, కృష్ణ భగవాన్, ఇంద్రజ, కంటెస్టెంట్లు కలిసి రాఘవకు సన్మానం చేశారు. ఆయన నటనను కొనియాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">