ETV Bharat / entertainment

లవర్స్​ డే గిఫ్ట్​.. 25 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి 'టైటానిక్'​ - టైటానిక్ మూవీ హీరోయిన్​

1997లో రిలీజై బాక్సాఫీస్​ను షేక్​ చేసిన టైటానిక్​ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఆ సంగతులు..

titanic re relase
titanic re relase
author img

By

Published : Jan 13, 2023, 10:37 AM IST

టైటానిక్​లో జాక్​-రోసీల ప్రేమ కథను ఎవరైనా మరచిపోతారా?. సుమారు 25 ఏళ్ల క్రితం రిలీజైనప్పటికీ ఈ సినిమాకు క్రేజ్​ అస్సలు తగ్గలేదనే చెప్పొచ్చు. దర్శక దిగ్గజం జేమ్స్​ కామెరూన్​ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ సినీ ప్రేమికుల మనసును గెలుచుకుని ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ​ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ వారి దగ్గరున్న టైటానిక్​ సీడీని అరిగిపోయేలా చూసుంటారంటే అతిశయోక్తి కాదేమో. అయితే టైటానిక్​ లవర్స్​ కోసం మూవీ టీమ్​ ఓ కొత్త అప్డేట్​తో సర్​ఫ్రైజ్​​ ఇచ్చింది.

అదేంటంటే.. ఫిబ్రవరిలో ఈ సినిమా 4కేలో రిలీజవ్వనుందట. మూవీ సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హైక్వాలిటీతో మరోసారి సిల్వర్‌ స్క్రీన్​పైకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్​. లవర్స్​డే స్పెషల్​గా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం పోస్టర్‌తో పాటు ఓ ట్రైలర్‌ని సైతం విడుదల చేసి ఫ్యాన్స్​ను ఆనందపరిచింది.

కాగా, 1997 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్​బస్టర్​ హిట్​ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి.. 2010లో 'అవతార్‌' విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డును గెలుపొందింది. చిత్ర దర్శకుడు కామెరూన్ తన సినిమా రికార్డ్‌ను తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్‌ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా 'టైటానిక్‌'దే. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ను 2012లో విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.