ETV Bharat / entertainment

Tiger Nageswararao Rao Theatres : టైగర్.. హైప్ లేదా? లేక కావాలనే వారు స్క్రీన్స్ ఇవ్వట్లేదా?

Tiger Nageswararao Rao Theatres : టైగర్ నాగేశ్వరరావు సినిమాకు తమిళంలో, కన్నడంలో స్క్రీన్లు దొరకట్లేదని ప్రచారం సాగుతున్నాయి. మరి అదే సమయంలో వాళ్ల సినిమాలకు ఇక్కడ దొరుకుతున్నాయిగా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!

Tiger Nageswararao Rao Theatres : టైగర్.. హైప్ లేదా? లేక కావాలనే వారు స్క్రీన్స్ ఇవ్వట్లేదా?
Tiger Nageswararao Rao Theatres : టైగర్.. హైప్ లేదా? లేక కావాలనే వారు స్క్రీన్స్ ఇవ్వట్లేదా?
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 9:33 PM IST

Tiger Nageswarao Rao Theatres : మరో ఏడు రోజుల్లో మాస్ మాహారాజా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా మూవీగా రిలీజ్​ కాబోతుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రమోషన్ల కోసం రవితేజ సౌత్​ టు నార్త్​ అన్ని ప్రధాన నగరాలు తిరిగేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఈ సినిమాకు తమిళంలో, కన్నడంలో కనీస థియేటర్లు కూడా దొరకకపోవడం బాధాకరమని ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

19నే తమిళంలో దళపతి విజయ్​ నటించిన లియో, కన్నడంలో సూపర్ స్టార్ శివ రాజ్​కుమార్ నటించిన​ ఘోస్ట్​ విడుదల కారణంగా ఈ చిత్రాలకే స్క్రీన్స్​ లాక్​ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సొంత భాష చిత్రాలు కాబట్టి.. మన సినిమాలకు స్క్రీన్స్​ - థియేటర్లు దొరకట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి అదే సమయంలో వారి చిత్రాలు కూడా ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఈ దసరాకైతే బాలయ్య భగవంత్ కేసరి - రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ చిత్రం లియో, కన్నడ చిత్రం ఘోస్ట్​కు మంచిగానే స్క్రీన్స్ దొరికాయని టాక్​! మరి వారికి ఎలాగా మన దగ్గర చెప్పుకోదగ్గ స్క్రీన్స్​, థియేటర్లు దొరుకున్నాయన్నది ప్రశ్న. అది కూడా ఇంత భారీ బక్సాఫీస్ పోటీలోనూ..

అంటే మనం మాత్రమే స్ట్రెట్ - డబ్బింగ్ అని తేడా లేకుండా అందరినీ ఆదరిస్తున్నామా? మరి వారు ఎందుకు అలా చేయడం లేదు అంటూ ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అసలు టైగర్​ నాగేశ్వరరావుకు అక్కడ హైప్​ లేక ఇలా చేస్తున్నారా? లేదంటే కావాలనే మన - తన భేదం చూపిస్తున్నారా? అనేది వారికే తెలియాలి. చూడాలి మరి ఈ సమస్య ఎలా, ఎప్పుడు తొలిగిపోతుందో...

కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికొస్తే.. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందింది. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. రన్‌టైమ్‌ ఏకంగా 3.02 గంటలు ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Yash Ravi Teja : యశ్​ గురించి రవితేజ అలా అనేశారేంటి.. ఫ్యాన్స్​ గుస్సా!

ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​.. వీడియో చూశారా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.