ETV Bharat / entertainment

సంక్రాంతి సినిమాలకు పెద్ద చిక్కు..! ఏం జరుగుతుందో? - సినిమా టికెట్ల రేట్లు లేటెస్ట్ న్యూస్

సంక్రాంతి సినిమాల సందర్భంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లకు డిమాండ్‌ పెరిగింది. అంతేకాదు, టికెట్‌ ధరలు పెంచుతారా? లేదా? అన్న ఆసక్తి కూడా నెలకొంది.

ticket rates to be hiked for sankranthi movies
సంక్రాంతి సినిమాలు
author img

By

Published : Jan 5, 2023, 10:16 PM IST

సంక్రాంతి సినిమాలంటే బాక్సాఫీస్‌ వద్ద భలే సందడి ఉంటుంది. కానీ, ఈసారి ఆ సందడి మరింత రెట్టింపు కానుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఈసారి అలరించేందుకు సిద్ధమయ్యాయి. విజయ్‌ 'వారసుడు' (జనవరి 11న), అజిత్‌ 'తెగింపు' (జనవరి 11న), బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' (జనవరి 12న), చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' (జనవరి 13న), సంతోష్‌ శోభన్‌ 'కల్యాణం కమనీయం' (జనవరి 14) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

థియేటర్‌లకు డిమాండ్‌
అగ్ర కథానాయకుల సినిమాలు వస్తుండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లకు భారీ డిమాండ్‌ నెలకొంది. తమ కథానాయకుడి సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించేలా అభిమానులు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. మల్టీప్లెక్స్‌లతో పాటు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ యజమానులతోనూ చర్చలు జరుపుతున్నారు. కొందరు రాజకీయంగానూ సిఫారసు చేయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం. సంక్రాంతి రేసులో తమిళ హీరోలు అజిత్‌, విజయ్‌లు ముందు ఉండటం వల్ల వీరికి అత్యధిక థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, అనంతరం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో కలిసి థియేటర్‌లను పంచుకోవాల్సి ఉంటుంది. ఈసారి సంక్రాంతి రేసులో చిరు-బాలకృష్ణ చిత్రాలు ఉండటం వల్ల బాక్సాఫీస్‌ మరింత రసవత్తరంగా మారనుంది.

టికెట్లు రేట్లు పెరుగుతాయా?
గత కొంతకాలంగా వరుస సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న, టికెట్‌ ధరలను మాత్రం పెంచలేదు. గతంలో నిర్ణయించిన ధరలనే అమలు చేస్తున్నారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం రోజులు టికెట్‌ ధరకు అదనంగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అదనపు షోలకు అనుమతి లభించేది. మరి సంక్రాంతి సినిమాలకు ఆ అనుమతి లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వద్దకు అర్జీలు వెళ్లాయి. ప్రస్తుత పరిస్థితి గురించి అటు సీఎం జగన్‌, ఇటు సీఎం కేసీఆర్‌లకు ఒక మాట చెప్పి, అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మల్టీ ప్లెక్స్‌లలో టికెట్‌ ధర రూ.175 ఉండగా, దాన్ని మరో వంద అదనంగా జత చేసే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో నగర, పట్టణ, మున్సిపాలిటీల వారీగా టికెట్‌ ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు. ఏపీలో గరిష్ఠంగా రూ.50కు మించపోవచ్చని అంటున్నారు. అయితే, టికెట్‌ ధరల పెంపు అన్ని చిత్రాలకూ ఉంటుందా? లేదా? అన్నది కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా నెలకొంది.

చిన్నా-పెద్దా తేడా లేకుండా అన్ని చిత్రాలకు వాటి బడ్జెట్‌ అనుగుణంగా పెంచితే గరిష్టంగా ఒక ధరను నిర్ణయిస్తే ఓకే. కొన్ని చిత్రాలకు పెంచి, మరికొన్నింటికి మొండి చేయి చూపితే, విమర్శలు తప్పవు. దీంతో ప్రభుత్వాలు కూడా ఆచితూచి దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి చిత్రాలకు సంబంధించిన బుకింగ్స్‌ ఓపెన్‌ కాలేదు. ఏ సినిమాను ఏ థియేటర్‌లో విడుదల చేయాలన్న స్పష్టత వచ్చిన తర్వాత ఈ వీకెండ్‌కు జాబితా వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

'బాలయ్య ఈగో లేని మనిషి.. ఆయనతో నటించడం అదృష్టం'.. విలన్​గా ఎంట్రీ ఇస్తున్న దునియా విజయ్​

దీపికకు 'ప్రాజెక్ట్-కే' టీమ్​ బర్త్​డే గిఫ్ట్.. 'చీకటిలో ఓ ఆశాదీపం' అంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.