ETV Bharat / entertainment

The night manager shobhita : తమన్నాను మించేలా శోభిత బోల్డ్​ సీన్స్​.. ఈ వీడియో చూస్తే.. - తమన్నా లస్ట్ స్టోరీస్​ 2 హాట్ సీన్స్​

The night manager shobhita : తమన్నా-మృణాల్ ఠాకూర్​ నటించిన 'లస్ట్ స్టోరీస్​ 2'కు పోటీగా శోభితా ధూళిపాల నటించిన 'ది నైట్ మేనేజర్​ 2' వెబ్​ సిరీస్ రిలీజైంది. ఇప్పటికే లస్ట్​ సిరీస్​లోని తమన్నా హాట్ సీన్స్​ నెట్టింట్లో వైరల్ కాగా.. ఇప్పుడు శోభిత బోల్డ్ సీన్స్​ ట్రెండింగ్​గా మారాయి. అవి చూస్తుంటే.. తమన్నాను మించేలా శోభిత హాట్​ సీన్స్​లో నటించినట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఆ వీడియోలను మీరు చూశారా?

Sobhita Dhulipala
The night manager shobhita : తమన్నాను మించేలా శోభిత బోల్డ్​ సీన్స్​.. ఈ వీడియో చూస్తే..
author img

By

Published : Jul 1, 2023, 7:41 AM IST

The night manager shobhita : 'గూఢచారి' చిత్రంతో టాలీవుడ్‌ అరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాల. 'మేజర్‌' చిత్రంతో బ్లాక్‌ బాస్టర్​ అందుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రంలోనూ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్​గా రాణిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన 'ది నైట్ మేనేజర్-2' వెబ్​ సిరీస్​ రిలీజైంది. తమన్నా, మృణాల్​ ఠాకూర్ నటించిన 'లస్ట్​ స్టోరీస్​ 2'కు పోటీగా.. ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. సీనియర్​ నటుడు అనిల్​ కపూర్​, బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్‌ కపూర్‌ కూడా ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్​ మంచి టాక్​నే తెచ్చుకుంది. మంచి థ్రిల్లింగ్​ను ఇచ్చిందని రివ్యూలు వస్తున్నాయి.

The night manager season 2 review : అయితే ఈ రివ్యూలతో పాటు ఈ వెబ్ సిరీస్‌లో నటించిన శోభిత ధూళిపాల సన్నివేశాలు కూడా నెట్టింటో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బోల్డ్​ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సిరీస్​లో మరింత బోల్డ్‌గా నటించినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతోంది. హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పోటీ పడి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు.. వాటిని ట్రెండ్ చేస్తూ లైక్స్​, కామెంట్స్ పెడుతున్నారు. బోల్డ్ వెబ్​సిరీస్​గా వచ్చిన 'లస్ట్​ స్టోరీస్ 2'లోని తమన్నాతో పోలుస్తున్నారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. మరికొందరు రొమాంటిక్ సీన్స్‌లో తమన్నాను మించిలే శోభితా ఉందిగా అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, శోభిత ధూళిపాల.. టాలీవుడ్​ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య రిలేషన్​షిప్​లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

the night manager season 2 : ఇక 'ది నైట్ మేనేజర్' సిరీస్​ను బ్రిటన్‌ సిరీస్‌ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు సందీప్ మోడీ దర్శకత్వం వహించారు. శాశ్వత ఛటర్జీ, తిలోటమా షోమ్, రవి బెహ్ల్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చూడండి :

శృంగారంపై మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ఇంట్లోనే అలా చేయాలట!

Lust stories 2 Review : తమన్నా, మృణాల్​ ఠాకూర్​కు వర్కౌట్​ అయినట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.