బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'కశ్మీర్ ఫైల్స్'.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన 'దిల్లీ ఫైల్స్' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్ చేసిన ఓ ట్వీట్ బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలను ఆయన టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
'కింగ్‌లు, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీయాలి. బాలీవుడ్‌ను ప్రజల పరిశ్రమగా మార్చాలి. అప్పుడు అది ప్రపంచ సినిమాను నడిపిస్తుంది' అని ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి. ఆయన చేసిన ఈ ట్వీట్.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను పరోక్షంగా అన్నట్లు స్పష్టమవుతుందంటున్నారు నెటిజన్లు.
-
As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022
ఇదీ చదవండి: సుస్మితా సేన్ ప్రేమికుల లిస్ట్ పెద్దదే.. 10 మందితో పైగా సహజీవనం