ETV Bharat / entertainment

11 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్-విజయ్.. 'పాలిటిక్స్'​ కన్ఫామేనా? - పొలిటికల్ నేపథ్యంలో విజయ్ శంకర్ సినిమా

vijay thalapathy shankar movie : కోలీవుడ్​ రాజకీయాల్లోకి విజయ్​ దళపతి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మరో వార్త బయటకు వచ్చింది. విజయ్​.. దిగ్గజ దర్శకుడు శంకర్​తో ఓ పొలిటికల్ థ్రిల్లర్​ సినిమాకు సైన్​ చేశారని తెలిసింగది. ఆ వివరాలు..

ThalapathyVijay  shankar  movie
11 ఏళ్ళ తర్వాత మరోసారి శంకర్-విజయ్.. పాలిటిక్స్​ కన్ఫామేనా?
author img

By

Published : Jul 12, 2023, 12:30 PM IST

vijay thalapathy shankar movie : మెగాపవర్​ స్టార్​ రామ్‌ చరణ్​తో 'గేమ్‌ ఛేంజర్‌', యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్​తో 'ఇండియన్ 2' వంటి భారీ సినిమాలు చేస్తున్నారు దిగ్గజ దర్శకుడు శంకర్​. ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్​ చేస్తూ షూటింగ్ చేస్తున్నారు శంకర్. ఇప్పటికే కొన్ని షెడ్యూళ్లు కూడా పూరయ్యాయి. అయితే ఇవి పూర్తి కాకముందే ఆయన మరో సినిమాను లైన్​లో పెట్టినట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​తో కలిసి ఆయన సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్​లో హాట్​టాపిక్​గా మారింది.

ఇప్పటికే శంకర్​-విజయ్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం అందింది. శంకర్​.. కథకు సంబంధించిన మెయిన్ పాయింట్​ను వివరించారట. అది విజయ్​కు బాగా నచ్చి సినిమాకు ఓకే చెప్పారని తెలిసింది. ఈ చిత్రం హార్డ్​ హిట్టింగ్ పొలిటికల్​ థ్రిల్లర్​గా రాబోతుందని అంటున్నారు. దళపతి 69 లేదా దళపతి 70గా ఇది రూపొందే అవకాశం ఉంది. ఇండియన్ 2, గేమ్​ ఛేంజర్ సినిమాలు పూర్తయ్యాక.. విజయ్ సినిమా కోసం పూర్తి స్క్రిప్ట్​ రాయడం ప్రారంభించనున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్లీ 11 ఏళ్ల తర్వాత (స్నేహితుడు సినిమా) వీరిద్దరు కలిసి సినిమా చేసినట్టవుతుంది.

ప్రస్తుతం కోలీవుడ్​ రాజకీయాల్లోకి విజయ్​ దళపతి ఎంట్రీ ఇవ్వనున్నారని తెగ ప్రచారం సాగుతోంది. ఆయన పాదయాత్రకు సన్నద్ధం అవుతోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్​ తమిళనాడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో విజయ్​.. శంకర్​తో కలిసి ఓ పొలిటికల్​ థ్రిల్లర్​ సినిమాకు ఓకే చెప్పారని వార్తలు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

RC 15 Gamechanger movie update: గేమ్​ఛేంజర్ అప్డేట్​.. ఇకపోతే తాజాగా శంకర్‌ షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్డేట్​ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. గేమ్​ ఛేంజర్​ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమా కోసం 'కేజీఎఫ్‌'లో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన అన్బు, అరివులు రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాలోని ఫైటింగ్‌ యాక్షన్​ సీక్వెన్స్​పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదీ చూడండి :

RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!

రాజకీయ నేతగా ​చరణ్​.. భారీగా తరలివచ్చిన అభిమానులు.. పోలీసుల ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.