ETV Bharat / entertainment

ముంబయిలో లగ్జరీ హౌస్​ను కొన్న సూర్య.. వామ్మో అన్ని కోట్లా! - లగ్జరీ హౌస్​ను కొన్న సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముంబయికి షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అక్కడ ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిటన్లు అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలు..

Tamil hero suriya new luxury house 70 crores
ముంబయిలో లగ్జరీ హౌస్​ను కొన్న సూర్య.. వామ్మో అన్ని కోట్లా!
author img

By

Published : Mar 20, 2023, 8:21 PM IST

Updated : Mar 20, 2023, 9:29 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఓ వైపు కమర్షియల్​ చిత్రాలు.. మరోవైపు సోషల్​ మెసేజ్​ చిత్రాలను చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. విధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 'ఆకాశం నీ హద్దురా' మూవీతో నేషనల్​ వైడ్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్​లతో బిజీగా ఉన్న ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన ఫ్యామిలీతో సహా ముంబయికి షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకోసం ఆయన ముంబయిలో రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. ముంబయిలో సెలబ్రిటీలు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్​ను కొనుగోలు చేశారట. నిజానికి ఈ ఇంద్రభవనం లాంటి ఇల్లును కొనుగోలు చేయడానికి ఆయనకు రూ.68కోట్లు అయ్యాయట. రిజిష్ట్రేషన్, ఇతర ఖర్చుల వల్ల మరో రూ. 2 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిసింది.

గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కింగ్, లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని అత్యాధునిక హంగులు కలిగి ఉన్న ఇంటిని తీసుకున్నారట సూర్య. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తైతే సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, హీరోయిన్ జ్యోతికను సూర్య 2006లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. అలాగే ఈయన ఓ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. 'Suriya 42'గా రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆయన పాన్​ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నారు. మార్కెట్​లో ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పది భాషల్లో త్రీడీ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నారట. డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌తో పాటు హిందీ రైట్స్‌ ఏకంగా రూ.100కోట్లకు అమ్ముడుపోయాయనే కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. చిత్రీకరణ పూర్తికాక ముందే రైట్స్‌ భారీ స్థాయిలో అమ్ముడుపోవడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రం తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ అనే మూవీ చేయనున్నారు.

ఇదీచూడండి: హృదయాన్ని హత్తుకునేలా 'రంగమార్తాండ' ట్రైలర్‌

Last Updated : Mar 20, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.