ETV Bharat / entertainment

సినిమా టికెట్‌ కోసం క్యూలో మహేశ్‌బాబు.. వీడియో వైరల్‌ - laal singh chaddha trailer

Mahesh Babu waits in queue: సూపర్​స్టార్​ మహేశ్​బాబు సినిమాల కోసం అభిమానులు, ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా క్యూ లో నిల్చొని ఎన్నోసార్లు టికెట్లు తీసుకున్నామని చెబుతుంటారు. అలాంటిది మహేశ్​బాబే ఓ సినిమా టికెట్​ కోసం క్యూ లైన్​లో నిలబడ్డారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

major movie mahesh babu
super star mahesh babu
author img

By

Published : May 29, 2022, 10:24 PM IST

Mahesh Babu waits in queue: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సినిమా టికెట్‌ కోసం క్యూలో నిలబడటమేంటని అనుకుంటున్నారా? స్టార్‌ హీరో కాబట్టి మీకా సందేహం రావడం సహజమే. ఎప్పుడూ లేనిది మహేశ్‌ ఇలా చేశాడంటే అందరికీ ఆసక్తి, ఆశ్చర్యమే. అందుకే సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన 'సర్కారు వారి పాట' సినిమా చూడ్డానికో, మరో చిత్రాన్ని వీక్షించడానికో ఆయన అలా చేయలేదు. తాను నిర్మించిన 'మేజర్‌' ప్రచారంలో భాగంగానే ఆయన ఓ థియేటర్‌ ముందు క్యూలో నించున్నారు. యూట్యూబర్‌, డిజిటల్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎంతో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేశారు. ఆ ఫన్నీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిహారిక సినిమా టికెట్‌ కోసం లైన్‌లో నిలబడగా ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో చిత్ర కథానాయకుడు అడివి శేష్‌ రాగానే వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఈలోపు మహేశ్‌బాబు వచ్చి క్యూలో నిలబడతారు. ఆయన్ను చూడగానే నిహారిక సర్‌ప్రైజ్‌ అవుతుంది. "మా స్నేహితులను కూడా పిలవొచ్చా" అని మహేశ్‌ అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్‌ పెరుగుతుంది. ఫోన్‌ నంబరు అడిగేలోపు మహేశ్‌ వెళ్లిపోవడం వల్ల నిహారిక అసహనం వ్యక్తం చేస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన వీరజవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రమే 'మేజర్'. శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. శోభిత, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.

టీ 20 తుది పోరులో.. 'లాల్‌సింగ్‌ చద్ధా' ట్రైలర్‌ సందడి: ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్ధా'. నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కరీనాకపూర్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం ఇప్పుడు మరో ముందడుగేసింది. ఉత్కంఠగా సాగుతున్న టీ20 తుది పోరులో ట్రైలర్‌ను ప్రదర్శించింది. అనంతరం, సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది.

ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రచార చిత్రంలో ఆమిర్‌, చైతన్యల లుక్‌ కొత్తగా ఉంది. ఈ ఇద్దరి అభిమానులు వీరి నుంచి ఆశించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇదీ చూడండి: 'ఆ పాత్ర కోసం సాయి పల్లవి ఆహారం తీసుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.