సినీ ఇండస్ట్రీలో నటీనటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య ఫ్రెండిష్ బాండింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో ఒకరికోసం మరొకరు ఏదో విధంగా సాయం చేసుకుంటుంటారు. ముఖ్యంగా తమ చిత్రాలను ఆడియెన్స్‌లో తీసుకెళ్లేందుకు తమ బాండింగ్‌నే ప్రమోషన్స్‌కు వినియోగించుకుంటుంటారు. అలా ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు.. తమ సన్నిహితుల సినిమా కోసం క్యామియోలు చేయడం, వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడం వంటివి మనం చూస్తూనే ఉంటుంటాం. ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. అయితే వీటిలో కొన్నిసార్లు ఫైనాన్షియల్ కోణం కూడా ఉండొచ్చు! ఇక విషయానికొస్తే.. ఇప్పుడు కమెడియన్ సునీల్.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో మాస్ మహారాజ్ రవితేజకు ఓ చిన్నపాటి సాయం చేశారు! ఇంకా చెప్పాలంటే తన రుణాన్ని తీర్చుకున్నారేమో!
గతంలో సునీల్ కెరీర్లో మర్యాద రామన్న ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్‌తో పాటు ఆయన సైకిల్ కూడా కాస్త కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సైకిల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో మాస్ మాహారాజ్ రవితేజ తనదైన స్టైల్లో వాయిస్ ఇవ్వడం సినిమాకు మంచి ఫన్‌గా హైలైట్‌గా నిలిచింది. ఆ సైకిల్ క్యారెక్టర్‌కు బాగా సెట్టయింది. అలానే ఆడియెన్స్‌కు మంచి వినోదాన్ని పంచింది. వాస్తవానికి అప్పట్లో రాజమౌళి అడిగితే రవితేజ.. ఈ డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు కానీ.. అది సునీల్‌కు, సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే అప్పటీ సాయానికి. ఇప్పుడు సునీల్ రుణం తీర్చుకున్నారు!
ఎలా అంటే.. రవితేజ నిర్మాతగా తాజాగా ఛాంగురే బంగారు రాజా అనే ఓ చిన్న సినిమాను రూపొందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఇందులో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రాజు, సత్య, డైరెక్టర్ కమ్ యాక్టర్ రవిబాబు కీలక పాత్రలు పోషించారు. సతీష్ వర్మ అనే యంగ్ దర్శకుడు దీనిని తెరకెక్కించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ ప్రచార చిత్రంలో.. ఓ కుక్క పాత్ర కూడా కీలకం. సినిమాలో కథను మలుపు తిప్పేది కూడా ఈ కుక్క పాత్రే. దాని పేరు వీర బొబ్బిలి. ఈ పాత్రకు సినిమా మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చింది సునీలే కావడం విశేషం. తనదైన స్టైల్లో కామెడీ టచ్‌ను చేస్తూ.. ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఫైనాన్షియల్ కోణం పక్కనపెడితో.. అలా గతంలో తన సైకిల్ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తే.. ఇప్పుడు రవితేజ నిర్మించిన సినిమాలో కుక్క పాత్రకు తన గొంతు అరువిచ్చారు సునీల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: టాలీవుడ్ గన్ VS కోలీవుడ్ కత్తి.. అయ్యగారు సింగిల్‌గా.. మణిరత్నం మల్టీస్టారర్‌గా!