Suma Son Roshan Movie Vs Sunitha Son Movie : తెలుగులో టాప్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ సుమ. అటు టీవీ షోల నుంచి ఇటు సినిమా ఈవెంట్స్ వరకు అన్నీ కవర్ చేసేస్తుంటారు. సెలబ్రిటీలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తుంటారు. అయితే సుమ, రాజీవ్ కనకాల ఏకైక కుమారుడు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
మరోవైపు, టాలీవుడ్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడడమే కాకుండా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత. ఆమె కుమారుడు ఆకాశ్ సర్కారి నౌకరీ సినిమాలో వెండితెరకు పరిచయమవుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు మూడు రోజుల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుమారులు హీరోలుగా అడుగుపెడుతున్న సమయంలో సుమ, సునీత ప్రమోషన్లలో బిజీగా ఉన్నారట.
రొమాంటిక్ అండ్ యూత్ పుల్ కంటెంట్
Suma Son Roshan Movie Trailer : అయితే రోషన్ నటించిన బబుల్ గమ్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. మంచి రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ కంటెంట్‌తో ఆ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ కారణంగా సినిమాకు కొంత బజ్ ఉంది.
-
Here's The Vibe of #HabibiJilebi - the first single from #Bubblegum.
— Sony Music South (@SonyMusicSouth) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sung by @Rahulsipligunj, Lyrics by @LyricsShyam
Music by @SricharanPakala
Full song from Nov 3rd, Stay Tuned!!@ravikanthperepu, @RoshanKanakala, @Maanasa_chou, @sureshraghu_DOP, @maheshwarimovie,… pic.twitter.com/tJqatzVVpb
">Here's The Vibe of #HabibiJilebi - the first single from #Bubblegum.
— Sony Music South (@SonyMusicSouth) October 31, 2023
Sung by @Rahulsipligunj, Lyrics by @LyricsShyam
Music by @SricharanPakala
Full song from Nov 3rd, Stay Tuned!!@ravikanthperepu, @RoshanKanakala, @Maanasa_chou, @sureshraghu_DOP, @maheshwarimovie,… pic.twitter.com/tJqatzVVpbHere's The Vibe of #HabibiJilebi - the first single from #Bubblegum.
— Sony Music South (@SonyMusicSouth) October 31, 2023
Sung by @Rahulsipligunj, Lyrics by @LyricsShyam
Music by @SricharanPakala
Full song from Nov 3rd, Stay Tuned!!@ravikanthperepu, @RoshanKanakala, @Maanasa_chou, @sureshraghu_DOP, @maheshwarimovie,… pic.twitter.com/tJqatzVVpb
క్లాస్ టచ్ మూవీ
Sunitha Son Akash Movie Trailer : ఆకాశ్ హీరోగా తెరకెక్కిన సర్కారు నౌకరితో గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ క్లాస్ టచ్‌తో గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేసే నిరుద్యోగి కష్టాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 1న థియేటర్స్‌లోకి వస్తోంది. బబుల్ గమ్ డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది.
-
This new year is going to be the most special one :)
— Akash Goparaju (@AkashGoparaju98) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Duty begins in theatres on 01.01.2024 🤎#SarkaaruNoukari @Ragavendraraoba @ShekarPhotos @BVazhapandal #SandilyaPisapati @OfficialSunitha @MangoMusicLabel pic.twitter.com/lp7aw2XJPG
">This new year is going to be the most special one :)
— Akash Goparaju (@AkashGoparaju98) December 15, 2023
Duty begins in theatres on 01.01.2024 🤎#SarkaaruNoukari @Ragavendraraoba @ShekarPhotos @BVazhapandal #SandilyaPisapati @OfficialSunitha @MangoMusicLabel pic.twitter.com/lp7aw2XJPGThis new year is going to be the most special one :)
— Akash Goparaju (@AkashGoparaju98) December 15, 2023
Duty begins in theatres on 01.01.2024 🤎#SarkaaruNoukari @Ragavendraraoba @ShekarPhotos @BVazhapandal #SandilyaPisapati @OfficialSunitha @MangoMusicLabel pic.twitter.com/lp7aw2XJPG
ఇద్దరికీ కీలకమే!
అయితే ఈ రెండు సినిమాలు ఆయా హీరోలకు కీలకమే. ఈ సినిమాలకొచ్చే రిజల్ట్ బట్టి హీరోలుగా వారి కెరీర్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రోషన్ కనకాల తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో బబుల్ గమ్‌తో యూత్‌కు కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరికి సక్సెస్ వస్తుందనేది చూడాలి.
ఎవరీ భాగ్యశ్రీ బొర్సే? రవితేజ హీరోయిన్ గురించి మీకు ఆ విషయం తెలుసా?
'ఒక్క సినిమా చేసి వెళ్లిపోదామనుకున్నా- ఆ మూవీలో హీరోగా చిరు అని ఫిక్సయ్యా!'