ETV Bharat / entertainment

సింగర్ మంగ్లీ కారుపై యువకుల రాళ్ల దాడి.. ఆ ప్రోగామ్​ నుంచి తిరిగి వెళ్తుండగా.. - mangli car latest news

సింగర్​ మంగ్లీ కారుపై కొంతమంది యువకులు రాళ్ల దాడి చేశారు. బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ.. ప్రోగ్రామ్​ పూర్తయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు ఈ ఘటన జరిగింది.

stone-pelting-on-singer-mangli-car-in-bellary-festival-here-s-complete-details

author img

By

Published : Jan 22, 2023, 3:14 PM IST

కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే?
బళ్లారి మున్సిపల్​ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్​ అట్టహాసంగా మెుదలైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ స్టేజ్ మీద పాటలు పాడింది. తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు యువకులు ఎగబడ్డారు. వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి కూడా ప్రవేశించారు. వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మంగ్లీ వెళ్లేటప్పుడు కొంతమంది యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు.

కొద్దిరోజుల క్రితం చిక్కబళ్లాపుర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో మంగ్లీని యాంకర్ అనుశ్రీ వేదిక మీదకు పిలిచింది. అందరికీ నమస్కారం అంటూ మంగ్లీ తెలుగులో చెప్పింది. ఇక్కడ కన్నడవారు ఉన్నారు.. కన్నడలో మాట్లాడండి.. అని అనుశ్రీ చెప్పినప్పుడు.. పక్కన అనంతపురం ఉంది.. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ సమాధానమిచ్చింది. బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది మంగ్లీ!. అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు తనకు అర్థం కావడం లేదని మంగ్లీ చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

కాగా, 'రాబర్ట్' సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో 'ఏక్ లవ్ యా' చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. 'పుష్ప' సినిమాలో ఊ అంటావా మామ పాటను కన్నడలో మంగ్లీనే పాడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.