Anand Devarakonda Highway Trailer: యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'హైవే'. కె.వి.గుహన్ తెరకెక్కించిన ఈ మూవీలో మానస హీరోయిన్గా నటించారు. ఆగస్టు 19న ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ట్రైలర్ చూస్తుంటే ఒక 'ఆవారా', ఓ 'రాక్షసన్' చిత్రం చూసినట్లుంది. ఈ చిత్ర టైటిల్ వినగానే చాలా పాజిటివ్‌గా వినిపించింది. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌కు థ్యాంక్స్. నాకు ప్రేక్షకులు లవర్ బాయ్ అని ట్యాగ్ తగిలించారు. ఆనంద్ మాత్రం ఒక్కో చిత్రం ఒక్కో జానర్‌లో చేస్తూ వైవిధ్యభరితంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది" అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రం కోసం కొవిడ్ టైమ్‌లో చాలా కష్టపడ్డాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ.. అతి తక్కువ మందితో షూట్ చేసి, అద్భుతమైన ఔట్‌పుట్ తీసుకొచ్చాం" అన్నారు హీరో ఆనంద్ దేవరకొండ. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ.. "ఓటీటీల వల్ల కొత్త జానర్లు ప్రయత్నించే అవకాశం వచ్చింది. ఈ కథ చెప్పగానే ఆనంద్ ఓకే చెప్పారు. ఇది రెగ్యులర్ హీరోయిక్ సినిమాల్లా ఉండదు" అన్నారు. కార్యక్రమంలో శరత్ మరార్, కార్తీక్, మానస తదితరులు పాల్గొన్నారు.
Sharwanand Okeoka Jeevitham movie: శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీకార్తీక్ తెరకెక్కించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మించారు. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమాలోని "ఒకటే కదా.. ఒకటే సదా..ఈ జీవితం" అనే పాట విడుదల చేశారు. ఈ గీతానికి జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యమందించారు. గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానుంది. కూర్పు: శ్రీజిత్ సారంగ్, ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Shakini Dhakini Movie: దక్షిణ కొరియా చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్'కు రీమేక్‌గా రూపొందిన చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రధారులు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. ఈ సినిమాని సెప్టెంబర్ 16న విడుదల చేయాలని నిర్ణయించారు. మంగళవారం ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. నివేదా, రెజీనా... శాలిని, దామిని అనే పేర్లతో కనిపించనున్నట్టు స్పష్టమవుతోంది. "యాక్షన్ కామెడీ చిత్రమిది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇందులో ఉంద"ని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్, కూర్పు: విప్లవ్ నైషధం, కళ: గాంధీ నడికుడికర్, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ప్రసాద్.
Commitment Movie: తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కమిట్‌మెంట్'. లక్ష్మికాంత్ చెన్న దర్శకుడు. బల్‌దేవ్ సింగ్, నీలిమ.టి సంయుక్తంగా నిర్మించారు. అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహారెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో మంచి మెసేజ్ ఉంది" అన్నారు. "దీంట్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా.. అవి ఎందుకున్నాయి అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది" అన్నారు నిర్మాత నీలిమ. నాయిక తనిష్క్ రాజన్ మాట్లాడుతూ.. "ఈ చిత్రం చూశాక చాలా మంది నా క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు. ప్రతి మహిళా చూడాల్సిన చిత్రమిది" అంది. కార్తీక్, సూర్య శ్రీనివాస్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు, ఇవే సాక్ష్యాలు