ETV Bharat / entertainment

Shankar Indian 2 Movie Update : కమల్​ మూవీపై దర్శకుడి క్లారిటీ.. మరి 'గేమ్ ఛేంజర్' సంగతేంటి? - ఇండియన్​ 2 మూవీ షూటింగ్

Shankar Indian 2 Movie Update : కమల్​ హాసన్​ - శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఇండియన్​-2'. భారీ బడ్జెట్​తో పాన్ ఇండియా లెవెల్​లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్​డేట్​ నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఇంతకీ అదేంటంటే ?

shankar indian 2 movie update
shankar indian 2 movie update
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 12:11 PM IST

Updated : Oct 10, 2023, 12:22 PM IST

Shankar Indian 2 Movie Update : స్టార్ దర్శకుడు శంకర్​- లోకనాయకుడు కమల్​హాసన్​ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'ఇండియన్​-2'. 90స్​లో బ్లాక్​ బస్టర్ టాక్ అందుకున్న 'ఇండియన్​-1'కు సీక్వెల్​గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే శంకర్ కూడా ఈ సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్​ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్​ను పంచుకున్నారు. 'ఇండియన్ 2' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సెషన్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా షేర్ చేసారు. ఆ వీడియో చూస్తుంటే..ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్​ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే విడుదల తేదీ​ గురించి ఇంకా క్లారిటీ రాలేదు.

Indian 2 Movie Shooting : ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్​.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ అన్నీ అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా పూర్తవుతోంది. అయితే ఓ వైపు ఈ సినిమా కంప్లీట్​ అవుతోందని కమల్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు చెర్రీ ఫ్యాన్స్ మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. 'గేమ్​ ఛేంజర్' సినిమా విషయంలో శంకర్​ ఎటువంటి అప్​డేట్​ ఇవ్వకపోవడమే దీనికి కారణం.

'ఇండియన్ 2' లేట్ అవుతుండటం వల్ల రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' సినిమాను పట్టాలెక్కించారు శంకర్​. అయితే మళ్లీ కమల్ హాసన్ సినిమా షూటింగ్ ప్రారంభించి.. రెండు సినిమాల పనులను చూసుకుంటూ వచ్చారు. దీంతో రామ్ చరణ్ సినిమా గురించి ఎటువంటి బజ్​ బయటకి రావడం లేదు. 'గేమ్​ ఛేంజర్​' నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా గురించి ఏదైనా శంకర్​నే అడగాలని చెబుతున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కంటెంట్ లీక్ అవుతుండటం వల్ల కూడా మెగా అభిమానులను ఆందోళ చెందుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఇప్పుడైనా 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి అప్​డేట్​ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Game Changer Latest Schedule : ఇటీవలే 'గేమ్ ఛేంజర్​' లేటెస్ట్ షెడ్యూల్​ చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా.. చివరి నిమిషంలో దర్శకుడు శంకర్ సడెన్​గా క్యాన్సిల్ చేశారట. అంతా రెడీ కూడా అయిపోయిందట.. కారణం ఏంటో తెలీదు కానీ.. శంకర్ తన ప్లాన్స్​ను మార్చుకున్నారని టాక్​. ఆ తర్వాత తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్​ హైదరబాద్​లో ప్రారంభమైంది. అంజలీ, చరణ్​ మీద కీలక సన్నివేశాలను అందులో చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందో కూడా అస్సలు క్లారిటీ లేదు. కానీ 'ఇండియన్​ 2' విడుదలయ్యాకే వస్తుందని టాక్ నడుస్తోంది.

'గేమ్​ ఛేంజర్​' సెట్స్​లో శంకర్​ బర్త్​డే సెలబ్రేషన్స్.. దిల్​ రాజు, చెర్రీ ఏం చేశారో తెలుసా?

Game Changer Leaked Song : 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్​పై దిల్​రాజు లీగల్ యాక్షన్.. సైబర్ క్రైమ్​లో కంప్లైంట్

Last Updated : Oct 10, 2023, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.