ETV Bharat / entertainment

రూ.వెయ్యి కోట్లతో శంకర్ సినిమా.. సూర్య-యశ్​లలో ఆఫర్​ ఎవరికి? - శంకర్ వెయ్యి కోట్ల సినిమా

ప్రముఖ దర్శకుడు శంకర్​.. వెయ్యి కోట్ల బడ్జెట్​తో సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రాన్ని హీరో సూర్యతో చేస్తారని మొన్నటివరకు టాక్​ రాగా.. ఇప్పుడా చిత్రాన్ని రాకింగ్ స్టార్​ యశ్​తో చేస్తారని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆఫర్​ ఎవరికి వరిస్తుందో?

Shankar 1000 crores movie with suriya and yash
సూర్య-యశ్​
author img

By

Published : Sep 17, 2022, 7:32 PM IST

కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌.. భారీ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​. ఇండియ‌న్ సినిమాల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ద‌క్కించుకున్న ఈయన.. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాల‌కు భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను అద్ది సక్సెస్​ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం కమల్​హాసన్​తో భారతీయుడు 2, రామ్​చరణ్​తో ఆర్​సీ 15 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత ఆయన ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది.

ఈ సంగతి పక్కనపెడితే.. కేజీయఫ్‌ 1, 2 చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించారు రాకింగ్ స్టార్ యశ్‌. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలతో ఆయన పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు. దీంతో ఆయన తర్వాత చిత్రం ఏంటి? అన్న ప్రశ్న.. ప్రస్తుతం సినీ అభిమానుల అందరిలోనూ మెదులుతోంది.

అయితే తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేంటంటే శంకర్​-యశ్​ కాంబోలో ఓ సినిమా రానుందని ప్రచారం సాగుతోంది. అంటే శంకర్​ తీయబోయే ఆ వెయ్యి కోట్ల సినిమా.. యశ్​తోనే అని సినీ వర్గాల టాక్​. ఈ మూవీని కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, పెన్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉందట. అయితే అంతకుముందు ఇదే సినిమాను శంకర్​.. తమిళ స్టార్ హీరో సూర్యతో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ.. ఒకవేళ తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్​ షేక్​ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ భారీ ప్రాజెక్ట్​లో సూర్య నటిస్తారో లేదా యశ్​ నటిస్తారా అనేది చూడాలి.

నవల ఆధారంగా.. తమిళ ఎపిక్‌ నవల 'వల్పరి' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. సు.వెంకటేశన్‌ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: మానసిక క్షోభను అనుభవించాను.. అప్పుడు ఆయనే నన్ను కాపాడారు!: సింగర్ సునీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.