ETV Bharat / entertainment

'చిరుతో అలా చేయాలన్న కోరిక ఉండిపోయింది.. కృష్ణంరాజు వల్లే ఇదంతా' - ఆలీతో సరదాగా కృష్ణంరాజు

సీనియర్​ ఎన్టీఆర్​, కృష్ణంరాజు సహా పలు హీరోలతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీనియర్​ నటి గీత. చిరంజీవితో అలా చేయాలన్న కోరిక ఉండిపోయిందని చెప్పారు. ఆ సంగతులు..

chiranjeevi
చిరంజీవి కృష్ణంరాజు
author img

By

Published : Sep 21, 2022, 5:27 PM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చానని సీనియర్ నటి గీత అన్నారు. ఆలీతో సరదాగా షో కు అతిథిగా విచ్చేసిన ఆమె తనకు సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. 'డ్యాన్స్ రాదంటున్నారు.. సాగర సంగమంలో కమల్ హాసన్ పక్కన ఎలా చేశారు..?' అని ఆలీ ప్రశ్నించగా.. ఆ సినిమాలో తానేక్కడ డ్యాన్స్ చేశానని.. ఆయనే (కమల్ హాసన్) అన్నారు. తాను కేవలం పరిగెత్తుకుంటూ వెళ్లానని నవ్వుతూ చెప్పారు.

'చిరంజీవి గారితో సినిమాలో నటించాలనే కోరిక ఉండేపోయింది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఆయన. ఒక్కడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా. ఓ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడు వేషం వేశారు. షూటింగ్‌కు అప్పుడు వాళ్ల అమ్మమ్మ వచ్చేది. మహేష్ బాబు పెద్ద హీరో అవుతాడని ఆవిడ అప్పుడే చెప్పారు. ఆమె చెప్పినట్లు ఆయన ఈరోజు పెద్ద హీరో అయ్యారు. సీనియన్​ ఎన్టీఆర్​తో కొండవీటి సింహం చేశా. ఆయనతో పెడతా పెడతా నామం పెడతా పాటలో స్టెప్పులు వేశా. శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశా. అప్పుడు డైలాగ్స్ చేతి మీద రాసుకుని చెప్పేదాన్ని. ఏడుస్తూ తలదించుకుని డైలాగ్స్ చూసి చెబితే.. అదో యాక్టింగ్ అనేశారు అప్పుడు. ఇప్పుడు అందరూ హీరోయిన్స్ ప్రాంప్టింగ్​ చేస్తున్నారు. యస్ చెప్పాలన్నా ప్రాంప్టింగ్​ అడుగుతున్నారు. నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు. ఆయన ఈరోజు లేరంటే మనసుకు చాలా బాధగా ఉంది. అందరి వచ్చి ఏదో ఒక రోజు వెళతారు. ఆయన లేకపోవడం బాధేస్తోంది' అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఉర్రూతలూగించేలా చిరు- సల్మాన్‌ల 'తార్‌ మార్‌' సాంగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.