ETV Bharat / entertainment

'గుంటూరు కారం', 'హనుమాన్' జోష్- దెబ్బకు థియేటర్లు ఫుల్ - guntur kaaram Occupancy

Sankranti Theatres Occupancy: 2024 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ మొదట్నుంచి ఆకస్తి రేకెత్తిస్తోంది. నేడు (జనవరి 12) రిలీజైన హనుమాన్, గుంటూరు కారం సినిమాలు మంచి టాక్​తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

Sankranti Theatres Occupancy
Sankranti Theatres Occupancy
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 6:50 PM IST

Updated : Jan 12, 2024, 8:52 PM IST

Sankranti Theatres Occupancy: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం వల్ల రద్దీ పెరిగింది. ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ అంటూ గురువారం (జనవరి 11) రాత్రి నుంచే సినీలవర్స్​ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. విజువల్ వండర్స్​ 'హనుమాన్' సినిమాకు ఆన్​లైన్​లో సగటున గంటకు 16వేల టికెట్లు బుక్ అవుతున్నాయట.

అటు మహేశ్​బాబు 'గుంటూరు కారం' సినిమా ​కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో రన్​ అవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ డే కలెక్షన్లు అదరగొట్టేశాయని ఇన్​ సైడ్ టాక్. ఇక శని, ఆదివారాల్లో 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు రానున్నాయి. పండగ సీజన్​తో పలు ఆఫీస్​లు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడం వల్ల రానున్న 5-6 రోజులు థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు కావడం పక్కా.

మరోవైపు ఇదేరోజు బాలీవుడ్ మూవీ 'మెర్రీ క్రిస్మస్', తమిళ్ సినిమాలు 'అయలాన్', 'కెప్టెన్ మిల్లర్' రిలీజయ్యాయి. కానీ, వాటికి ఆయా రాష్ట్రాల్లో 'హనుమాన్', 'గుంటూరు కారం' స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్​ రాలేదనే చెప్పాలి. దీంతో కంటెంట్ బాగుంటే ఒకే రోజు ఎన్ని సినిమాలు వచ్చినా, తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని అర్థమైపోతుంది.

గుంటూరు కారం సినిమాకు తొలి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 11.2 లక్షల టికెట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యాయట. అటు హనుమాన్​ సినిమాకు దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే హనుమాన్ మూవీకి స్క్రీన్లు తక్కువగా ఉన్నప్పటికీ ఆ రేంజ్​లో ఆడియెన్స్ థియేటర్​కు రావడం విశేషం. దీంతో ఈ రెండు సినిమాలకు కలిపి ఒక్కరోదే దాదాపు 13 లక్షలకుపైగా జనాలు థియేటర్లకు వచ్చారన్నమాట.

Mahesh Babu At sudarshan Theatre: సూపర్​స్టార్ మహేశ్​బాబు ఫ్యాన్స్​తో కలిసి ఆర్​టీసీ క్రాస్​రోడ్స్​ వద్ద సుదర్శన్ 35MM థియేటర్లో శుక్రవారం గుంటూరు కారం సినిమా చూశారు. మహేశ్​బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్​, డైరెక్టర్ వంశీ పైడిపళ్లి కూడా ఉన్నారు.

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

'హనుమాన్' రాంపేజ్​ - ప్రశాంత్ వర్మ ఈ రేంజ్​​ అస్సలు ఉహించలేదయ్యా!

Last Updated : Jan 12, 2024, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.