Sankranti Movies Directors Fight: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో సంక్రాంతి సందడి మొదలవ్వనుంది. ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం', తేజ సజ్జ 'హనుమాన్', విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్', నాగార్జున అక్కినేని 'నా సామిరంగ' సినిమాలతో స్టార్ల మధ్య బాక్సాఫీస్ పోటీ నెలకొంది. అయితే ఈ సంక్రాంతికి హీరోల మధ్య పోటీయే కాకుండా డైరెక్టర్ల మధ్య పోటీ అని కూడా చెప్పుకోవచ్చు. బరిలో ఉన్న నలుగురు దర్శకులు కూడా
త్రివిక్రమ్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్‌బాబు లీడ్ రోల్లో గుంటూరు కారం తెరకెక్కించారు. వీరి కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా, ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా జనవరి 12న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రశాంత్ వర్మ: ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ (VFX), సీజీ వర్క్స్ (CG Works)తో హాలీవుడ్ రేంజ్లో ఆయన హనుమాన్ తెరకెక్కించారు. కెరీర్లో ఇప్పటిరే జాంబిరెడ్డి, ఆ!, కల్కి వంటి డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రశాంత్, ఇప్పుడు సూపర్ పవర్స్ ఉన్న ఓ కుర్రాడి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గుంటూరు కారంసినిమాతో పాటే హనుమాన్ కూడా జనవరి 12న రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శైలేష్ కొలను: దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా సైంధవ్ సినిమాను తెరకెక్కించారు శైలేష్ కొలను. తండ్రీ, కూతుళ్ల మధ్య ఎటాట్మెంట్తో ఈ సినిమా ఉండనుంది. కెరీర్లో హిట్-1, హిట్-2 చిత్రాలతో సక్సెస్ అందుకున్న శైలేష్ ఈ చిత్రంతో కెరీర్లో తొలి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సైంధవ్ జనవరి 13న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విజయ్ బిన్ని: 'నా సామిరంగ'తో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు విజయ్ బిన్ని. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీ రోల్స్‌లో నటించారు. సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించే నాగార్జున గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి పొంగల్ బరిలో నిలిచారు. తాజాగా డైరెక్టర్ విజయ్ ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నారు. మరి ఆయన తొలి ప్రయత్నం ఎలా ఉండనుందో జనవరి 14న సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అయితే అన్ని సినిమాలు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ముగించుకొని, ప్రమోషన్స్‌లో బిజిగా ఉన్నాయి. ఈ నలుగురు టాలెంటెడ్ దర్శకుల్లో ఎవరిది పైచేయి అవుతుందో అన్నది వేచి చూడాలి.
కళ్లు చెదిరే రేంజ్లో 'గుంటూరు కారం' బిజినెస్ - ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే!
'హనుమాన్' ప్రీమియర్ షోస్ టికెట్స్ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!