Sankranthi Movies 2024 : తెలుగు రాష్ట్రాల్లో బంధువులంతా ఒక చోట కలిసి సంక్రాంతి పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ ఆనందాన్ని మరింత డబుల్ చేసుకోవడానికి కొత్త సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ పండుగ సమయంలో సినిమా హిట్ ప్లాప్ టాక్‌తో సంబంధం ఉండదు. కుటుంబమంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశామా లేదా అనేది ముఖ్యం. దీంతో ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు కాసుల వర్షం కురవడం పక్కా. అందుకే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగకు అటు థియేటర్లల్లో, ఇటు ఓటీటీల్లో రిలీజయ్యేందుకు సిద్ధమయ్యాయి.
గుంటూరు కారంతో మూడోసారి!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పాటలు ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూపర్ హీరోగా తేజ!
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందిన చిత్రం హను-మాన్. ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. సామాన్యుడు అసమాన్యమైన శక్తులను పొంది, చెడుపై ఎలా విజయం సాధించాడనేది చిత్ర కథ. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్ అంచనాలు పెంచేలా చేసింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ కూడా జనవరి 12న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సైంధవ్‌తో వెంకటేశ్
ఫ్యామిలీ ఆడియన్స్‌కు అత్యంత చేరువైన నటుడు వెంకటేశ్. గత చిత్రాలకు భిన్నంగా శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. వెంకటేశ్ నటించిన 75వ సినిమా అయినా ఈ చిత్రం జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్ యాక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నా సామి రంగ అంటున్న నాగ్!
కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం నా సామిరంగ. ఆషికా రంగనాథ్ కథానాయిక కాగా, అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన పొరింజు మరియం జోసే చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తీర్చిదిద్దారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అయలాన్ ఎంట్రీ!
సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఒకట్రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఇక్కడి ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈసారి తమిళ చిత్రం అయలాన్‌తో శివకార్తికేయన్ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
- నెట్‌ఫ్లిక్స్
- బ్రేక్ పాయింట్ (వెబ్‌సిరీస్2) జనవరి 10
- కింగ్ డమ్-3 (జపనీస్) జనవరి 10
- ది ట్రస్ట్ (వెబ్‌సిరీస్) జనవరి 10
- బాయ్ స్వాలోస్ యూనివర్స్(వెబ్‌సిరీస్)జనవరి 10
- కిల్లర్ సూప్ (హిందీ) జనవరి 11
- ఛాంపియన్ (వెబ్‌సిరీస్)
- లిఫ్ట్ (హాలీవుడ్) జనవరి 12
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- డిస్నీ+హాట్‌స్టార్
- ఎకో (వెబ్‌సిరీస్) జనవరి 11
- ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (యానిమేషన్ సిరీస్) జనవరి 12
- సోనీలివ్
- జర్నీ (తమిళ చిత్రం) జనవరి 12
- ఆహా
- కోట బొమ్మాళి పి.ఎస్. (తెలుగు) జనవరి11
- సేవప్పి (తమిళ) జనవరి 12
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బుక్ మై షో
- వన్ మోర్ షాట్ (హాలీవుడ్) జనవరి 9
- జియో సినిమా
- ల బ్రియా (వెబ్‌సిరీస్) జనవరి 10
- టెడ్ (వెబ్‌సిరీస్) జనవరి 12
- అమెజాన్ ప్రైమ్ వీడియో
- మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ (హాలీవుడ్) జనవరి 11
- రోల్‌ప్లే (హలీవుడ్) జనవరి 12
- ఆపిల్ టీవీ ప్లస్
- క్రిమినల్ రికార్డ్ (వెబ్ సిరీస్) జనవరి 10
- కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (హాలీవుడ్) జనవరి 12
- " class="align-text-top noRightClick twitterSection" data="">