Sankranthi 2024 Movies Runtime : ఈ సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ముందుకు దూసుకొస్తున్నాయి. వీటిలో మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ ఉన్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు అన్నీ కూడా యు/ఏ సర్టిఫికేట్ దక్కించుకున్నాయి.
అలాగే ఈ మూవీస్ రన్ టైమ్ కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న విడుదల కానున్న 'గుంటూరు కారం' చిత్రం 159 నిమిషాలు. అంటే రెండు గంటల 39 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అదే రోజు విడుదల కానున్న హనుమాన్ కూడా దాదాపు ఇదే నిడివితో రానుంది. రెండు గంటల 38 నిమిషాల నిడివితో వస్తుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా తేజ సజ్జా హీరోగా నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంకా వెంకీ మామ నటించిన సైంధవ్ సినిమా రెండు గంటల 20 నిమిషాల రన్ టైంతో జనవరి 13న థియేటర్లలోరి అభిమానుల ముందుకు రానుంది. హిట్ మూవీ దర్శకుడు శైలేశ్ కొలను ఈ సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే చివరగా జనవరి 14న విడుదల కానున్న నాగార్జున నా సామిరంగ రెండు గంటల 26 నిమిషాల రన్ టైమ్‌ను లాక్ చేసుకుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొత్తంగా ఈ నాలుగు చిత్రాల నిడివి చూస్తే గుంటూరు కారం రన్ టైమ్ ఎక్కువగా ఉంది. వెంకీ సైంధవ్ కాస్త తక్కువ నిడివితో అలరించనుంది. ఫైనల్‌గా ఈ నాలుగు సినిమాలన్నీ కూడా పర్ఫెక్ట్ రన్ వస్తున్నందున్న ఆడియెన్స్ కూడా సినిమా లెంగ్తీగా ఉందని అనుకునే అవకాశం లేదు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే గుంటూరు కారం రూ. 135 కోట్లు, హనుమాన్, సైంధవ్ రూ. 25 కోట్లు, నాగార్జున నా సామిరంగ రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
కళ్లు చెదిరే రేంజ్లో 'గుంటూరు కారం' బిజినెస్ - ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే!
మూడు నెలలు పవన్ కల్యాణ్తోనే ఉన్నా - ఆయనెప్పుడు నావాడే : బిగ్ బాస్ బ్యూటీ