ETV Bharat / entertainment

సమంత మరో స్పెషల్​ సాంగ్​.. 'ఊ అంటవా మావా..'ను మించేలా? - sandeep reddy vanga animal

'పుష్ప'లో 'ఊ అంటవా మావా..' పాటతో ఊపుఊపేసింది అగ్రతార సమంత. మరోసారి అలాంటి స్పెషల్ గీతంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ వంగ దర్శకత్వంలో రణ్​బీర్ కపూర్ నటిస్తున్న 'యానిమల్' చిత్రంలో సామ్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉంది.

Samantha
సమంత
author img

By

Published : Jun 28, 2022, 11:21 AM IST

టాలీవుడ్​తో పాటు ఇప్పుడు బాలీవుడ్​లోనూ క్రేజీ హీరోయిన్​గా మారిపోయారు స్టార్ హీరోయిన్​ సమంత. ఇప్పటికే దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఉన్న సామ్​.. 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్​సిరీస్​, నాగచైతన్యతో విడాకుల వంటి కారణాలతో కొంతకాలంగా ట్రెండింగ్​లో ఉంది. ఇక ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​తో 'పుష్ప'లో 'ఊ అంటవా మావా..' పాటతో మరింత సంచలనంగా మారింది. ఈ పాటతోనే బాలీవుడ్​లోనూ యమా క్రేజ్ సంపాదించుకుంది సామ్. తాజా సమాచారం ప్రకారం ఆమెకు మరో ప్రత్యేక గీతంలో నటించేందుకు ఆఫర్​ వచ్చినట్లు తెలుస్తోంది.

'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ నటిస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమాలోనే ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నారట సందీప్. ఈ పాటలో నటించేందుకు సమంతను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకుంటుందో లేదో!

మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథే 'యానిమల్'. మనిషి జంతువులా మారితే? అనే ఈ కోణంలో సాగనుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఆ అనుభవం ఎలా ఉంటుందో చూపించారు: అవికా గోర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.