ETV Bharat / entertainment

డీప్​ డిస్కషన్స్​లో సమంత-అనుష్క శర్మ.. త్వరలోనే.. - Samantha Anushka sharma women centric film

సమంత-అనుష్క శర్మ కలిసి ఓ ప్రాజెక్ట్​ కోసం వర్క్​ చేయబోతున్నారట. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

Samantha Anushka sharma
సమంత-అనుష్క శర్మ కలిసి..
author img

By

Published : May 4, 2023, 12:41 PM IST

రీసెంట్​గా భారీ అంచనాలతో వచ్చిన 'శాకుంతలం' సినిమాతో డిజాస్టర్​ను అందుకున్న హీరోయిన్ సమంత.. ఆ మూవీ రిజల్ట్​ను పక్కనపెట్టేసి.. ప్రస్తుతం 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్​​ వెబ్​సిరీస్​ షూటింగ్​తో బిజీగా ఉంటోంది. అలాగే తన కొత్త ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టి గట్టి హిట్​ కొట్టేందుకు కూడా ఫుల్​ ఫోకస్​ చేస్తోంది. వరుసగా కథలు కూడా వింటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. సామ్​.. టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్​ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్​ అనుష్క శర్మతో కలిసి వర్క్​ చేయబోతుందట. వీరిద్దరు కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని తెలిసింది. అయితే అది వెబ్​సిరీస్​ కోసమా లేదా సినిమా కోసమా అనేది స్పష్టత లేదు. కానీ.. ఈ ప్రాజెక్ట్​కు అనుష్క శర్మ బ్రదర్​ కర్ణేశ్ శర్మ నిర్మాతగా వ్యవహరిస్తారని అంతా అంటున్నారు. ఇందులో సమంత మెయిన్​ లీడ్​లో నటించబోతుందని కూడా చెబుతున్నారు. త్వరలోనే చర్చలు ఓ కొలిక్కి వచ్చాక పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం అందింది. అయితే ఈ ప్రాజెక్ట్​లో సమంతతో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తుందా? లేదంటే కేవలం తన బ్రదర్​తో కలిసి ప్రొడ్యూస్​ చేస్తుందా? ఈ ప్రాజెక్ట్​లో సామ్​ నటించడంతో పాటు ఇన్వెస్ట్​ కూడా చేసి నిర్మాతగా మారుబోతుందా? అనే ప్రశ్నలు సినీ ప్రియుల మదిలో మెదులుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇక సామ్​ సినిమాల విషయానికొస్తే.. సిటాడెల్​ వెబ్​సిరీస్​తో పాటు హిందీలో ఓ హారర్​ సినిమా చేస్తోంది. అయితే ఈ హారర్​ మూవీ గురించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్స్​ లేవు. తెలుగులో సెన్షేషన్ హీరో విజయ్​ దేవరకొండతో ఖుషి అనే లవ్​స్టోరీ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. శాకుంతలం డిజాస్టర్​ అవ్వడంతో సిటాటెల్​, ఖుషిపైనే ఆశలు పెట్టుకుంది సామ్​.

అనుష్క శర్మ విషయానికొస్తే.. ఆమె చివరిసారిగా 2018లో షారుక్​ ఖాన్ జీరో సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్​ అవ్వడంతో మళ్లీ ఆమె తెరపై కనిపించలేదు. ప్రొడ్యూసర్​గా మారి తన తమ్ముడితో సినిమాలను నిర్మించే పనిలో బిజీ అయిపోయింది. బల్బ్​బుల్​ సినిమా, పాటల్​ లోక్​ సిరీస్​ను నిర్మించింది. ఆ మధ్యలో కాలా చిత్రంలో గెస్ట్​ రోల్​లో మెరిసింది. ఆ తర్వాత మహిళా క్రికెటర్​ ఝులన్​ గోస్వామి బయోపిక్​ 'చక్దా ఎక్స్​ప్రెస్​' సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అనుష్క కూడా మరో కొత్త సినిమాను లైన్​లో పెట్టేందుకు ఫోకస్​ పెడుతోంది. ఇందులో భాగంగానే సమంతతో కలిసి చర్చలు జరపుతోందని తెలుస్తోంది. చూడాలి మరి సామ్​-అనుష్క ప్రాజెక్ట్​ కార్యరూపం దాల్చుతుందో లేదో.

ఇదీ చూడండి: బికినీలో కొబ్బరి చెట్టెక్కిన సంయుక్త.. కిరాక్ పోజులిస్తూ చిల్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.