ETV Bharat / entertainment

యశ్​ కొత్త లుక్​ అదుర్స్​.. 'సలార్​' సినిమా కోసమేనా?

author img

By

Published : Jul 5, 2023, 10:31 PM IST

Updated : Jul 5, 2023, 10:57 PM IST

కేజీఎఫ్​ హీరో యశ్​ కొత్త లుక్​లో ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఆ పోస్టర్​ 'సలార్'​ మూవీ టీజర్​​లోనిదేనా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

salaar teaser release date and time
కొత్త లుక్​లో కేజీఎఫ్ హీరో.. ఆ సినిమా కోసమేనా..?

Yash Look : రెబల్​ స్టార్​ ప్రభాస్​ హీరోగా నటిస్తున్న 'సలార్​' సినిమాకు సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే.. 'కేజీఎఫ్​' ఫేమ్ యశ్​ కొత్త లుక్​లో ఉన్న పోస్టర్​. దీంతో అది 'సలార్'​ సినిమా టీజర్​​లోని పోస్టరేనా అంటూ ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు. 'కేజీఎఫ్​' సిరీస్​తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Salaar Teaser Release Date : తాజాగా విడుదలైన ఆదిపురుష్​ సినిమా నెగటివ్​ టాక్​ను తెచ్చుకున్న నేపథ్యంలో సలార్​ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే 'సలార్'​ టీజర్​ విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది మూవీ యూనిట్​. ఈ నెల 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్​ను విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్​ తెలిపింది. దీంతో టీజర్​ ఎప్పుడెప్పుడు రిలీజ్​ అవుతుందా అని ఫ్యాన్స్​ ఈగర్​గా వెయిట్​ చేస్తున్నారు.

అంత ఉదయమా..
Salaar Teaser Release Date And Time : 'కేజీఎఫ్​'తో సూపర్​ హిట్​ అందుకున్నారు హీరో యశ్​ దర్శకుడు ప్రశాంత్ నీల్​. అయితే సలార్​- కేజీఎఫ్​ సినిమాలకు ఏదో లింక్​ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనికి మరింత బలం చేకూర్చేలా సినిమా టీజర్​ విడుదల సమయం ఉంది. అదు కూడా భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 5:12 నిమిషాలు. 'కేజీయఫ్-2'లో రాఖీ భాయ్​ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో ఉన్న గడియారంలో ఉన్న సమయం కూడా ఉదయం 5:12 నిమిషాలే. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈ ట్రోలింగ్​లకు చెక్​ పడాలంటే జులై 6న సలార్​ టీజర్​ రిలీజ్​ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

పప్పులో కాలేశారు..
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యశ్​ కొత్త లుక్​ ఫొటోలు 'సలార్' టీజర్ లోనివి కాదని స్పష్టంగా తెలుస్తోంది. అది ఓ కంపెనీకి చెందిన యాడ్​ వీడియో. ఇందులో యశ్​ కౌబాయ్​ గెటప్​లో కనిపిస్తూ.. చేతిలో బియర్డ్​ ఆయిల్​ పట్టుకుని ప్రమోషన్​ చేశారు​. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోతో పాటు ఓ పోస్టర్​ను విడుదల చేసింది సదరు సంస్థ. ఆ వీడియోలోని ఫొటోలను స్క్రీన్ షాట్ తీసి సలార్​ సినిమాకు లింక్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు కొందరు ఆకతాయిలు. దీంతో అది కాస్త వైరల్​గా మారింది. వాటిని చూసిన ప్రభాస్​ అభిమానులు అది నిజంగానే సలార్​ టీజర్​లోని పోస్టర్​ అని అనుకున్నారు.

Last Updated : Jul 5, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.