ETV Bharat / entertainment

'సలార్​' బిగ్ అప్​డేట్ - ట్రైలర్​ రిలీజ్​కు మహుర్తం ఫిక్స్​! - Salaar movie release date

Salaar Trailer Update : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 'సలార్​' ట్రైలర్ గురించి అప్​డేట్ వచ్చింది. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే?

Prabhas Salaar Trailer Release On December 1st
Salaar Trailer Update
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 7:39 PM IST

Salaar Trailer Update : : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్​తో 'సలార్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్​ కాస్త నిరాశ చెందారు. అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి.. డార్లింగ్స్ ఫ్యాన్స్​కు ఫుల్​కిక్​ ఇచ్చే అప్​డేట్ వచ్చింది.

సలార్ ట్రైలర్​ను డిసెంబర్​ 1న విడుదల చేయాలని చిత్రయూనిట్​ భావిస్తున్నట్లు.. బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్​ ఎనలిస్ట్ తరణ్ ఆదర్ష్​ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్​)​లో వెల్లడించారు. దీంతో డార్లింగ్​ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ​ఈ ట్వీట్​ను తెగ వైరల్​ చేస్తున్నారు. అయితే తరణ్ ఆదర్ష్.. రిలీజ్​ డేట్​ గురించి చెప్పినప్పటికీ..మూవీటీమ్​ నుంచి మాత్రం అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రావాల్సి ఉంది.

ఈగర్లీ వెయిటింగ్​ ..
ట్రైలర్​ గురించి సినీ క్రిటిక్​ ఇచ్చిన అప్డేట్​ను సినిమా సన్నిహిత వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు మూవీ నుంచి స్టిల్స్​, చిన్నపాటి గ్లింప్స్ వీడియోను మాత్రమే రిలీజ్​ చేశారు. ఇక మరో మూడు వారాల్లో 'సలార్' ట్రైలర్​ విడుదల కానుండంటంతో రెబల్​ స్టార్​ ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ట్రైలర్ వస్తే.. డైనోసార్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బ్యాక్​ టు హైదరాబాద్​..
క్రిస్మస్ కానుకగా 'సలార్​'ను డిసెంబర్​ 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీటీమ్​ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, గతకొన్ని రోజులుగా యూరప్​ ట్రిప్​లో ఉన్న ప్రభాస్​ బుధవారం హైదరాబాద్​కు తిరిగి వచ్చారు. డార్లింగ్​ కమ్​ బ్యాక్​తో సినిమా ప్రమోషన్స్​ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 'సలార్' సినిమాలో ప్రభాస్​కు జోడీగా శృతి హాసన్​ నటించారు.

'యానిమల్'షో ఇంటర్వెల్​లో 'సలార్​' ట్రైలర్​?
దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'యానిమల్​'. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​బీర్ కపూర్ హీరో నటించారు. ఈయనకు జోడీగా రష్మిక మందన్నా ఆడిపాడింది. ఈ సినిమా డిసెంబర్​ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్​ షో ఇంటర్వెల్​ సమయంలోనే 'సలార్​' ట్రైలర్​ను విడుదలే చేసే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్​ వీధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

షారుక్​ 'డంకీ' ఎఫెక్ట్​ 'సలార్'​పై ఉంటుందా?
బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన తాజా చిత్రం 'డంకీ'. ఈ సినిమా కూడా 'సలార్​' విడుదల రోజే రిలీజ్​ అవుతుంది. అయితే వాస్తవానికి 'సలార్​' టీమ్​ కన్నా ముందే 'డంకీ' దర్శకులు రాజ్ కుమార్ హిరాణీ తమ సినిమాను డిసెంబర్​ 22న విడుదల చేయాలని ఫిక్స్​ అయ్యారు. దాని ప్రకారమే రిలీజ్​ చేస్తున్నారు. వాస్తవానికి 'సలార్​' మాత్రం సెప్టెంబర్​ 28న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలతో అది వాయిదా పడి షారుక్​ సినిమాతో పాటు పోటీలోకి దిగనుంది. దీంతో ఇద్దరూ బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్​ పోటీపడనున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రభాస్​ ఈజ్ బ్యాక్​ - ఇక 'సలార్​' సందడి షురూ!

సల్మాన్​ ఖాన్​ 'టైగర్​-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్​ చేసింది ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.