ETV Bharat / entertainment

పెళ్లిపై మాట్లాడిన సాయిపల్లవి.. ఏమన్నారంటే? - సాయిపల్లవి విరాటపర్వం రిలీజ్​ డేట్​

Saipallavi about marriage life: సినిమాల్లోకి రాకపోయి ఉంటే చదువు కొనసాగించేదానిని అన్నారు హీరోయిన్ సాయిపల్లవి. ఇంకా తన పెళ్లి గురించి కూడా మాట్లాడారు. ఆ విశేషాలివీ..

saipallavi
సాయిపల్లవి
author img

By

Published : Jun 11, 2022, 11:42 AM IST

Saipallavi about marriage life: సాయిపల్లవి.. ఓవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రలు.. మరోవైపు కమర్షియల్‌ కథలు.. రెండిటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వరుస విజయాలతో కెరీర్​లో ముందుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఇష్టాయిష్టాలను చెప్పుకొచ్చారు. తనకు 23ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని, 30ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారని తాను భావించినట్లు తెలిపారు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే చదువు కొనసాగించేదానిని అని చెప్పారు. ఇంకా పలు విషయాలను తెలిపారు.

"అమ్మానాన్న తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అంటుంటారు. ఎందుకంటే మేము మాట్లాడుకునే సమయంలో నేను తెలుగులో మాట్లాడేస్తుంటాను. నాకు ఏదైనా నచ్చకపోతే ఆ దారిలో వెళ్లను. ఇండస్ట్రీ నచ్చకపోయి ఉంటే చదువుకొనసాగించేదాన్ని. ఇక పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అని అనను. చూసే విధానం ఎప్పుడు మారుతుందో అప్పుడు కాన్ఫిడెన్స్​ వచ్చేస్తుంది. చిరంజీవి 'ముఠామేస్త్రి' సినిమాలోని ఓ స్టెప్పు వేయడానికి ఎన్నో సార్లు ట్రై చేశా. అలాగే నడక కలిసిన నవరాత్రి పాటలోని స్టెప్​ కూడా చాలా ఇష్టం. ఫిదా సినిమా నుంచి నా డబ్బింగ్​ నేనే చెప్పుకుంటున్నా." అని సాయిపల్లవి పేర్కొంది. కాగా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' జూన్​ 17న విడుదల కానుంది.

ఇదీ చూడండి: రణ్​వీర్​ సాహసం.. ఎలుగుబంటితో పోరాటం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.