ETV Bharat / entertainment

RRRకు ఏడాది.. ఊహకు అందని అవార్డులు.. లెక్కకు మించిన రివార్డులు!

author img

By

Published : Mar 25, 2023, 12:27 PM IST

Updated : Mar 25, 2023, 12:47 PM IST

ఎన్నో అవార్డులతో పాటు ప్రశంసలను అందుకున్న ఆర్​ఆర్​ఆర్​ మూవీ రిలీజై నేటితో సరిగ్గా ఏడాది అయింది. ఈ క్రమంలో ఆర్​ఆర్​ఆర్​ సాధించిన ఘనతల గురించి తెలుసుకుందాం.

rrr awards list
rrr

'ఆర్​ఆర్​ఆర్'​.. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ బద్దలు కొట్టడమే కాకుండా తెలుగు సినిమా హిస్టరీలో ఓ సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఈ సినిమా రిలీజయ్యింది. కానీ అభిమానులందరికి ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే అనిపిస్తుంటుంది. అసలు ఆర్​ఆర్​ఆర్​లోని మూడు ఆర్​లకు రౌద్రం, రణం,రుధిరం అని అర్థం. కానీ ఈ సినిమాకొచ్చిన పాపులారిటీతో అది కాస్త రాజమౌళి, రామ్​ చరణ్​, రామారావుగా మారింది! అంతటి రేంజ్​ను సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికీ పలు థియేటర్లలో రన్​ అవుతోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు!

ప్రతిష్ఠాత్మక అవార్డులతో పాటు ప్రముఖుల ప్రశంసల వెల్లువతో పాన్​ వరల్డ్​ రేంజ్​లోకి ఎదిగింది ఈ సినిమా. జేమ్స్​ కామెరూన్​, స్టీవ్​ స్పిల్​ బర్గ్​ లాంటి దిగ్గజాలు సినిమాను చూసి ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ను కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక 'నాటు నాటు' సాంగ్​కు ఆస్కార్ దక్కడంతో తెలుగోడి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. అంతకు మందు ఆర్​ఆర్​ఆర్​ను ప్రతిష్ఠాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డు కూడా వరించింది.

ఇక ఈ సినిమా తర్వాత 'ఆర్​ఆర్​ఆర్'​ తారలు వరుస ఆఫర్లతో బిజీగా అయిపోయారు. ఓ వైపు రామ్ చరణ్​.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్​సీ 15లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్​ శిష్యుడు దర్శకుడు నర్తన్​తో ఓ సినిమాకు సైన్​ చేశారట. మరోవైపు జూనియర్​ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్​ 30 సినిమాలో నటిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమంతో సెట్స్​ పైకి వెళ్లిన ఈ సినిమాలో ఎన్టీఆర్​కు జోడీగా దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో ఎన్టీఆర్​ రోల్​ చాలా డిఫరెంట్​గా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. మృగాలను వేటాడే మగాడిగా కనిపించనున్నారని తెలిపారు. ఈ సినిమా తర్వాత 'కేజీఎఫ్' డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​తో తారక్​ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి విషయానికొస్తే.. 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్​ బాబుతో ఓ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. SSMB 29 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే జక్కన్న టీమ్​ సన్నాహాలు ప్రారంభించింది. ఇక ఈ సినిమా అడ్వెంచర్​ నేపథ్యంలో సాగనుంది.

'నా వల్లే ఆస్కార్ వచ్చింది'
బాలీవుడ్​ స్టార్​ హీరో అజయ్​ దేవ్​గణ్​ ఇటీవలే 'నాటు నాటు' సాంగ్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే ఆ సాంగ్​కు ఆస్కార్​ అవార్డు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే ఆయన నటించిన 'భోళా' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రముఖ కామెడీ రియాలిటీ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో యాంకర్​ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.

అందులో.. 'నాటు నాటు'కి ఆస్కార్ రావడం గురించి హోస్ట్ ప్రశ్న అడగ్గా.. దానికి 'నా వల్లే ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ వచ్చింది' అంటూ సమాధానమిచ్చారు. అది విన్న హోస్ట్​ ఒక్కసారిగా షాక్​కు గురై.. అదేలా అని అడిగారు. తాను డ్యాన్స్ చేసి ఉంటే కచ్చితంగా ఆస్కార్ వ‌చ్చేది కాద‌ని సరదాగా బదులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

Last Updated : Mar 25, 2023, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.