ETV Bharat / entertainment

'ఆర్‌ఆర్‌ఆర్‌' బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌.. ఇలా తెరకెక్కించారు! - ఆర్​ఆర్​ఆర్​ మూవీ బ్రిడ్జ్​ సీన్స్​

RRR Bridge sequence VFX video: 'ఆర్​ఆర్​ఆర్​'లో చరణ్‌-తారక్‌లు మొదటిసారి కలుసుకున్నప్పుడు చూపించే బ్రిడ్జ్‌, ట్రైన్‌ యాక్సిడెంట్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆ 'బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌'ను ఎలా క్రియేట్​ చేశారో ఓ వీడియో బయటకు వచ్చింది. దాన్ని చూసేయండి..

RRR movie Bridge sequence
'ఆర్‌ఆర్‌ఆర్‌' బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌
author img

By

Published : May 30, 2022, 3:40 PM IST

RRR Bridge sequence VFX video: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 25న రిలీజ్​ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓటీటీలోనూ సూపర్​ రెస్పాన్స్​ను అందుకుంది.

కాగా, ఈ చిత్రంలో చరణ్‌-తారక్‌లు మొదటిసారి కలుసుకున్నప్పుడు చూపించే బ్రిడ్జ్‌, ట్రైన్‌ యాక్సిడెంట్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల చేత ఔరా అనిపిస్తున్నాయి. రాజమౌళి టేకింగ్‌ని, కెమెరా పనితనాన్ని, వీఎఫ్‌ఎక్స్‌.. ఇలా టీమ్‌ మొత్తాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు వీఎఫ్‌ఎక్స్‌ ఎలా క్రియేట్‌ చేశారో తెలియజేస్తూ తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది.

ముఖ్యంగా 'బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌' క్రియేట్‌ చేయడం కోసం డెన్మార్క్‌కు చెందిన ఓ బృందం ప్రత్యేకంగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ చేసింది. రైల్వే బ్రిడ్జ్‌, దాని చుట్టు పక్కల ఉండే గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం కోసం ఆ బృందం రాజమండ్రికి చేరుకుని.. గోదావరి బ్రిడ్జ్‌.. దాని పరిసరాలను పరిశీలించి, ఫొటోలు తీసుకుంది. అనంతరం డెన్మార్క్‌ చేరుకుని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ప్రారంభించింది. ఆ వీడియోను మీరు చూసేయండి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: యాంకర్స్​ ఓవర్​యాక్షన్​.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతిశెట్టి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.