ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ దేశంలోనే కూడా అంతర్జాతీయ స్థాయిలోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు.. జక్కన్న స్క్రీన్ ప్లేకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
అయితే కొద్ది రోజులుగా.. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తారక్ పులి ఫైట్.. బ్రిటిష్ కోటలో తారక్ ఎంట్రీ.. వ్యాన్ నిండుగా జంతువులను ఎలా తీసుకువచ్చారు.. ఇలా పలు సీన్స్ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో మాయజాలం గురించి బయటపెట్టేశారు జక్కన్న.
సెకండ్ హాఫ్‌లో తన బావ రామరాజు కోసం హత్రాస్ వచ్చిన సీత.. తన స్నేహితుడి కోసం రామారాజు బంధీగా ఉండిపోయారని.. మరో రెండు రోజుల్లో ఉరి తీస్తున్నారనే విషయం భీం కుటుంబానికి చెప్పే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశంలో తారక్, అలియా నటన ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సన్నివేశం మొత్తం కూడా ఓ నైట్ ఎఫెక్ట్‌లో ఒక సత్రం సెట్టింగ్‌లో చిత్రీకరించారు. ఆ సీన్ తాలుకూ కాన్సెప్ట్ ఆర్ట్, టెస్ట్ షూట్, ఫైనల్ షాట్ ఫోటోలను మూవీటీమ్ షేర్ చేసింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాన్ని మీరూ చూసేయండి..
ఇదీ చూడండి: రజనీకాంత్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మణిరత్నం.. కారణం ఏంటంటే?