ETV Bharat / entertainment

'మీ అన్న కుమారుడా..? అకీరా నా అబ్బాయి!!'.. పవన్​ ఫ్యాన్​పై రేణు ఫైర్​ - రేణూ దేశాయ్ అకిరా నందన్ బర్త్​డే పోస్ట్​

సోషల్​ మీడియా వేదికగా నటి రేణూ దేశాయ్​ పవన్​ అభిమానుల మీద మరోసారి ఫైర్​ అయ్యారు. తన కొడుకు బర్త్​డేకు పెట్టిన పోస్ట్​కు పవన్​ అభిమానులు పెట్టిన కామెంట్స్​కు ఆగ్రహించి తనదైన శైలి​లో రిప్లై ఇచ్చారు.

Etv Bharat
renu desai comments on akira post
author img

By

Published : Apr 9, 2023, 11:55 AM IST

అకీరా నందన్​ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై నటి రేణూ దేశాయ్‌ సామాజిక మాధ్యమ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'అకీరా నా కొడుకు. మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అంటూ తన అసంతృప్తిని బయటపెట్టారు. నెటిజన్ల నుంచి వస్తోన్న ఇలాంటి ట్వీట్ల వల్ల తాను బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్‌ శనివారం 19వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రేణు దేశాయ్​ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇక ఆ వీడియోపై పలువురు పవన్​ అభిమానులు కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆ పోస్ట్​పై స్పందించిన ఓ ఫ్యాన్​ "మేడమ్‌.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది" అని కామెంట్‌ చేశాడు. దీంతో ఆ కామెంట్‌పై అసహనం వ్యక్తం చేసిన రేణు.. "మీ అన్న తనయుడా..? అకీరా నా అబ్బాయి!! మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి కొంచం నేర్చుకోండి! ఇలాంటి మెసేజ్​లు, కామెంట్లను నేను ప్రతిసారీ పట్టించుకోకుండా వదిలేస్తుంటాను. కానీ, మీలాంటి కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు" అంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో పాటు ఆమె పలు కామెంట్లను ఇన్​స్టా స్టోరీలో షేర్​ చేశారు. "అకీరా బర్త్‌డే రోజు కూడా నా ఇన్‌స్టా అకౌంట్​లోకి వచ్చి నెగెటివ్‌ కామెంట్స్‌ ఎందుకు పెడుతున్నారు? 11 ఏళ్ల నుంచి అర్థం చేసుకుంటున్నాను. కానీ, మీరు పెట్టే కామెంట్ల వల్ల ఈ రోజు ఒక తల్లిగా హార్ట్‌ అవుతున్నాను. మనుషులకు ఏమవుతుందో అస్సలు అర్థం కావడం లేదు. 11 ఏళ్లుగా నన్ను ఒక విలన్‌గా చూస్తున్నారు. నేను పూర్తిగా అలసిపోయాను. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై స్పందించకపోతే ఇది నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించేలా ఉంది" అని అన్నారు.

renu desai comments on akira post
రేణూ దేశాయ్​ రిప్లై
renu desai comments on akira post
రేణూ దేశాయ్​ రిప్లై

ఇక ఈ విషయంపై మరో నెటిజన్‌ స్పందించారు. "మేడమ్‌. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరి బిడ్డవి అని అడిగితే తండ్రి పేరే చెబుతారు. ఇది మా సంస్కృతి. కాబట్టి కారణం లేకుండా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయకండి" అని కామెంట్‌ చేశాడు. దీనికి స్పందించిన ఆమె.. "మీకు జన్మనిచ్చిన తల్లిని అగౌరవపరచడం మీ సంస్కృతా? భారతీయ సంస్కృతిలో తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను దేవుడితో సమానంగా చూస్తారు. కావాలంటే మీ తల్లిని ఓసారి అడిగి తెలుసుకోండి. నా పోస్టులపై తరచూ కామెంట్లు చేయొద్దని ఫ్యాన్స్‌కు చెప్పండి. కారణం లేకుండా వారు కామెంట్స్‌ చేస్తున్నారు" అని పేర్కొన్నారు.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ జంట. 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2012లో విడిపోయారు. అయితే అప్పుడప్పుడు పవన్​ తన పిల్లలను పలకరిస్తూ కనిపిస్తుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.