ETV Bharat / entertainment

ఆమె రాత్రికి రమ్మంది!.. క్యాస్టింగ్ కౌచ్​పై 'రేసు గుర్రం' యాక్టర్ షాకింగ్ కామెంట్స్​

రేసు గుర్రం విలన్​, స్టార్ యాక్టర్​ రవి కిషన్‌ షాకింగ్ ఆరోపణలు చేశారు. తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Mar 27, 2023, 7:04 PM IST

Ravi Kishan casting couch
క్యాస్టింగ్ కౌచ్​పై 'రేసు గుర్రం' యాక్టర్ షాకింగ్ కామెంట్స్​

నటుడు, భాజపా నేత రవి కిషన్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్‌ తొలినాళ్లలో తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ ఆరోపణలు చేశారు. గతంలో ఓ మహిళ తనని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిందని, ప్రస్తుతం ఆమెకు సమాజంలో పేరు, పలుకుబడి ఉందని అన్నారు. తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్​ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే సీనియర్ నటి నగ్మాతో ఉన్న రిలేషన్​షిప్​ గురించి కూడా మాట్లాడారు. "చిత్రసీమలోకి వచ్చిన సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇబ్బందికర పరిస్థితులను చూశాను. ఇకపోతే క్యాస్టింగ్‌ కౌచ్‌ సినీ పరిశ్రమలో సాధారణం. నేనూ అలాంటి వాటిని ఎదుర్కొన్నా. ఒకానొక స్టేజ్​లో ఓ మహిళ నా దగ్గరకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం అని అడిగింది. నాకెందుకో డౌట్​ వచ్చి.. సున్నితంగా నో చెప్పాను. అయితే.. ఆమె ఎవరూ అనేది ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు సమాజంలో ఎంతో పేరు ఉంది" అని రవికిషన్‌ పేర్కొన్నారు.

ఆ తర్వాత సీనియర్ నటి నగ్మాతో రవి కిషన్​ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వాటిపైనా ఆయన మాట్లాడారు. "నటీనటులు కలిసి వరుసగా కొన్ని చిత్రాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని, అఫైర్​ నడుస్తుందని వార్తలు వస్తుంటాయి. నిజానికీ అవన్నీ రూమర్స్​ మాత్రమే. మేము కలిసి నటించిన సినిమాలు సూపర్​హిట్​గా నిలవడంతో మళ్లీ మా కాంబో కొనసాగుతూ వచ్చింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్​. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయినా మేమిద్దరం కలిసి చిత్రాలు చేసేటప్పటికే.. నాకు పెళ్లి అయిందని అందరికీ తెలుసు." అని రవి కిషన్ చెప్పుకొచ్చారు.

కాగా, రవికిషన్..​ నటుడు కావాలని చిన్నప్పటి నుంచి అనుకునేవారట. కానీ ఆయన తండ్రికి అది నచ్చలేదు. అమ్మ మాత్రం ప్రోత్సాహించేది. ఓ సారి ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబయి వెళ్లేందుకు మద్దతుగా నిలిచింది. అలా తన తల్లి ప్రోత్సాహంతో, తన కష్టంతో మంచి నటుడిగా ఎదిగారు. భోజ్‌పురిలో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. అలా బాలీవుడ్​తో పాట సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు రవికిషన్​. అల్లు అర్జున్​ 'రేసుగుర్రం'తో టాలీవుడ్​కు పరిచయమయ్యారు. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు. ఇంకా తెలుగులో కిక్​ 2, సుప్రీమ్​, ఒక అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్​ఎల్​ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, గద్దలకొండ గణేశ్​, హీరో వంటి చిత్రాల్లో నటించారు. గతేడాది ఖాఖీ: ది బీహార్‌ చాప్టర్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు.

ఇదీ చూడండి: గాయపడినా షూటింగ్​ ఆపని స్టార్​ హీరో.. రూ.15 కోట్లతో యాక్షన్​ సీన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.