ETV Bharat / entertainment

కొరియన్‌, థాయ్‌లాండ్‌ స్టార్స్​తో రష్మిక.. క్యూట్​ పోజులు అదిరాయిగా! - థాయ్​లాండ్​​ యాకర్స్​తో రష్మిక

సౌత్‌ కొరియన్‌, థాయ్‌లాండ్‌కు చెందిన యాక్టర్స్​తో హీరోయిన్​ రష్మిక సందడి చేసింది. వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అవి ప్రస్తుతం సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

Rashmika
కొరియన్‌, థాయ్‌లాండ్‌ స్టార్స్​తో రష్మిక.. క్యూట్​ పోజులు అదిరాయిగా!
author img

By

Published : Feb 23, 2023, 10:48 PM IST

తన అందంతో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది హీరోయిన్‌ రష్మిక. అలానే తన హావభావాలతో యూత్​కు గిలిగింతలు పెడుతుంది. 'పుష్ప' సినిమాతో ఏకంగా నేషనల్‌ క్రష్‌గా ట్యాగ్​ అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ బడా హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్​లో జోరు ప్రదర్శిస్తోంది. మరోవైపు తన పర్సనల్​ విషయాలను, సినిమాకు సంబంధించిన అప్డేట్​ను సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇదే సోషల్​మీడియాలో స్క్రిన్​ షోస్​తో గ్లామర్​ ట్రీట్​ ఇస్తూ ఫాలోయింగ్​ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్​ బిజీగా గడుపుతోంది.

అయితే ఫ్యాషన్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపే ఈ ముద్దుగుమ్మ.. ఇటలీలోని మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ ఈవెంట్‌కు హాజరై సందడి చేసింది. ఎంతో పాపులర్​ అయిన ఆ ఫ్యాషన్‌ వీక్‌లో పలు దేశాలకు చెందిన యాక్టర్స్​ పాల్గొంటుంటారనే విషయం తెలిసిందే. అలా అక్కడకు వెళ్లిన సౌత్‌ కొరియన్‌ యాక్టర్​ జంగ్‌ ఊ, థాయ్‌లాండ్‌కు చెందిన మరో నటుడు గల్ఫ్‌ కానావుత్‌తో కలిసి రష్మిక సందడి చేసింది. వారితో కలిసి ముచ్చటిస్తూ ఫొటోలకు పోజులిస్తూ ఎంజాయ్ చేసింది. అలానే వీటికి సంబంధించిన పిక్స్​ను తన ఇన్‌స్టా ఖాతా స్టేటస్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'క్యూట్‌', 'గ్రేట్‌', 'వావ్‌', 'సూపర్​' అంటూ లైక్స్​, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇకపోతే రష్మి విషయానికొస్తే.. ఈ సంక్రాంతికి విడుదలైన వారసుడు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మిషన్‌ మజ్ను’'తో అలరించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్​తో 'యానిమల్‌', అల్లు అర్జున్​తో 'పుష్ప 2' చేస్తోంది. మరోవైపు 'మై లవ్', 'ది వరల్డ్‌ ఆఫ్‌ సైలెన్స్‌', 'ది రైజ్‌ ఆఫ్‌ టామ్‌బాయ్‌' తదితర చిత్రాలు, 'హై-ఎండ్‌ క్రష్‌' వెబ్‌ సిరీస్‌తో కొరియాన్​ యాక్టర్​ జంగ్‌... 'వై ఆర్‌ యు' సహా పలు సిరీస్‌లు, టెలివిజన్‌ షోలతో థాయ్​లాండ్​ నటుడు గల్ఫ్‌ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇదీ చూడండి: కన్నడ నుంచి మరో పవర్​ప్యాక్డ్​ మూవీ.. స్టన్నింగ్​ యాక్షన్​ విజువల్స్​తో టీజర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.