Ranveersingh Bold photoshoot ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ చేసిన బోల్డ్ ఫొటోషూట్ గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలు బయటకు రావడంతో వాటిని చూసిన నెటిజన్లు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ, మహిళా న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెంబూరు పోలీస‌్ స్టేషన్‌లో గత నెలలోనే కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపై రణ్‌వీర్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు.
అయితే తాజాగా ఈ విషయమై అతడి వాంగ్మూలాన్ని ముంబయి పోలీసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. నేడు ఉదయం రణ్వీర్ పోలీస్ స్టేషన్‌కు ఏడు గంటల సమయంలో వచ్చారని, ఆ తర్వాత తొమ్మిదిన్నారకి వెళ్లిపోయారని తెలిపారు. అవసరమైతే మళ్లీ నటుడిని పిలిపిస్తామని పేర్కొన్నారు. కాగా, రణ్వీర్ ప్రస్తుతం సర్కస్, రాణీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: అన్న హరికృష్ణను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్