ETV Bharat / entertainment

రామ్​చరణ్​ కొత్త మూవీ అప్డేట్​.. ఛాన్స్ కొట్టేసిన 'బింబిసార' డైరెక్టర్! - రామ్​చరణ్ కొత్త సినిమలు

బింబిసార మూవీతో వశిష్ట్​.. క్రేజీ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయారు. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ రామ్ చరణ్‌తో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్‌కు స్టోరీ లైన్ చెప్పగా ఆయనకు నచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ..

ramcharan new movie with bimbisara director vashist

author img

By

Published : Nov 9, 2022, 9:27 PM IST

Ramcharan Bimbisara Director: మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ గురించి క్రేజీ అప్డేట్​ వెలుగులోకి వచ్చింది. వశిష్ట్​ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' మూవీ ఈ ఏడాది విడుదలై.. బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. మూవీని వశిష్ట్​ ట్యాకిల్ చేసిన తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. దాంతో టాలీవుడ్‌లోని క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన వశిష్ట్​.. ఇటీవలే రామ్​చరణ్‌కు ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని చెర్రీ సూచించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

రామ్​చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఆర్‌సీ 15' ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఓ ఫాంటసీ డ్రామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వశిష్ట్​ చెప్పిన ఫాంటసీ డ్రామా లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రామ్​చరణ్‌కు ఇటీవల 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు కథ చెప్పారు. సీనియర్ డైరెక్టర్ సుకుమార్ కూడా రామ్​చరణ్‌తో సినిమా కోసం స్టోరీని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి 'ఆర్‌సీ 15' తర్వాత రామ్ చరణ్‌ ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.