ETV Bharat / entertainment

తొలిసారి ఇన్​స్టా లైవ్​లోకి రంభ.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే? - రంభ ఇన్​స్టాగ్రామ్​

రోడ్డు ప్రమాదం అనంతరం నటి రంభ.. తొలిసారిగా 'ఇన్‌స్టా' లైవ్‌లో తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. తన చిన్న కుమార్తె సాషా సహా తామంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఇంకేమన్నారంటే?

rambha-happy-about-her-daughter-recovery

author img

By

Published : Nov 2, 2022, 7:12 PM IST

Rambha Road Accident: తన చిన్న కుమార్తె సాషా సహా తామంతా క్షేమంగా ఉన్నామని నటి రంభ తెలిపారు. తాము క్షేమంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. సాషా ఆరోగ్యం మెరుగుపడిందని, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చామంటూ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారిగా 'ఇన్‌స్టా' లైవ్‌లో పాల్గొన్న రంభ తన అభిమాలనులతో కాసేపు ముచ్చటించారు. "ఇప్పటికీ మీరు నాపై అభిమానం చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు అమ్మాయిని. ఆంధ్రాలో పుట్టి, పెరిగా. నేను ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషను నేర్చుకుంటా. హైదరాబాద్‌ తప్పకుండా వస్తా" అని నటి అన్నారు.

కెనడాలోని ఒంటారియోలో స్థిరపడ్డ రంభ.. సోమవారం సాయంత్రం కారు ప్రమాదానికి గురైంది. తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా రంభ కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమార్తె సాషాకు గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు. అదే కారులో ప్రయాణించిన రంభ, మిగిలిన పిల్లలు, ఆయాకు స్వల్ప గాయాలయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా సంబంధిత ఫొటోలను పోస్ట్‌ చేసిన రంభ.. "దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యం" అని కోరారు. 'ఆ ఒక్కటీ అడక్కు'తో నటిగా మారిన రంభ 100కిపైగా చిత్రాల్లో నటించి అలరించారు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించిన రంభ వివాహానంతరం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.