ETV Bharat / entertainment

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత! - రామ్​చరణ్​ ఉపాసన దంపతులు

Ram Charan Forbes Magazine : మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Ram Charan Forbes Magazine
Ram Charan Forbes Magazine
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 8:46 AM IST

Updated : Dec 23, 2023, 9:09 AM IST

Ram Charan Forbes Magazine : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు చరణ్ దంపతులు.

ఇక ఈ ఇంటర్వ్యూలో వారి ప్రేమ కథ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెసుల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా ఆమె ఒడిలో చెయ్యి పెట్టి నేలపై చరణ్ కూర్చున్న విధానం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ ఇంటర్వ్యూలో వీరి జీవితంలోకి క్లీంకార వచ్చాక జరిగిన మార్పులను వారు వివరించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.

శిందేను కలిసిన రామ్​చరణ్ దంపతులు
మరోవైపు, ప్రస్తుతం ముంబయి ట్రిప్​లో ఉన్న రామ్​చరణ్ దంపతులు, ఆయన సతీమణి ఉపాసన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందేను కలిశారు. ముంబయిలోని తన నివాసానికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు సీఎం శిందే సాదర స్వాగతం పలికారు. సీఎంతో కలిసిన ఫొటోను ఉపాసన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

'మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని పేర్కొంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మరోవైపు, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సీఎం ఏక్‌నాథ్ శిందే కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. రామ్ చరణ్, ఉపాసనతో సమావేశం బాగా జరిగిందని తెలిపారు. తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్ఛంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు శిందే. సినీ రంగంతోపాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.

ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. పొలిటికల్ సెటైర్​గా ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్​కు గ్యాప్ ఇచ్చి కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో విజేతగా స్టార్ హీరో

ముంబయిలో చెర్రీ ఫ్యామిలీ- క్లీంకారకు కరీన బిగ్ హెల్ప్!- బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సా?

Last Updated : Dec 23, 2023, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.