ETV Bharat / entertainment

రామ్​చరణ్​-ఉపాసన కుమార్తెకు నామకరణం.. పేరుకు అర్థం ఇదేనట! - klin kaara name meaning

Ram Charan daughter name : రామ్​చరణ్ ​- ఉపాసన దంపతుల కుమార్తెకు నామకరణం శుక్రవారం జరిగింది. మెగా ప్రిన్సెస్​కు 'క్లీం కార కొణిదెల' అని పేరు పెట్టారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. చిన్నారికి బంగారు ఊయల కానుకగా ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు టీమ్​చెర్రి.

Ram Charan daughter name
Ram Charan daughter name
author img

By

Published : Jun 30, 2023, 4:23 PM IST

Updated : Jul 1, 2023, 6:33 AM IST

Ram Charan daughter name : మెగా ప్రిన్సెస్ నామకరణం శుక్రవారం ఘనంగా జరిగింది. రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు 'క్లీం కార కొణిదెల' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం 'క్లీం కార కొణిదెల' అనే పేరును లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది పెట్టినట్లు మెగా ఫ్యామిలీ వెల్లడించింది. 'క్లీం కార కొణిదెల' అంటే ప్రకృతి అవతారమని, మహాశక్తిని అని అర్థం స్ఫురిస్తుంది.

ఓంకార రూపిణి, క్లీంకార వాసిని

జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥

రామ్​చరణ్ - ఉపాసన దంపతులు అడపిల్లకు జన్మను ఇవ్వగానే.. ఆ చిన్నారి నక్షత్రం, రాశి, పూర్తి జాతకంపై ఆయా స్వామీజీలు దృష్టి సారించారు. ఈ క్రమంలో పాపకు ఏం పేరు పెట్టనున్నారన్న విషయంపై అటు సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఉపాసన డెలివరీ సమయంలో ప్రెస్​ మీట్​లో రామ్​ చరణ్​ కూడా పాప పేరు ఇప్పటికే డిసైడ్​ చేశామని చెప్పడం వల్ల.. అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. చివరికి అందరి నిరీక్షణకు తెర దించుతూ.. బారసాల కార్యక్రమంలోనే మెగా ప్రిన్సెస్ పేరును రివీల్ చేశారు. ఈ నామకరణ మహోత్సవ కార్యక్రమంలో చిరు.. సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. చిరంజీవి దంపతులు, వారి వియ్యంకులు చిన్నారిని ఊయలలో ఊపుతూ ఉన్న ఓ ఫొటోను విడుదల చేశారు.

Ram Charan daughter name
నామకరణ మహోత్సవంలో మెగా ఫ్యామిలీ

చెక్క ఊయలలోనే మెగా ప్రిన్సెస్​కు బారసాల.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ అండ్​ టీమ్..!
Ramcharan : హీరో రామ్​చరణ్​-ఉపాసన దంపతుల కూతురుకు.. వ్యాపార దిగ్గజం ముఖేశ్​ అంబానీ పంపిన బంగారు ఊయలలో బారసాల చేశారనే వార్తలపై స్పష్టత ఇచ్చింది చెర్రీ అండ్​ టీమ్​. ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. ప్రజ్వల ఫౌండేషన్‌ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలలోనే చిన్నారి బారసాల వేడుకలు జరిపినట్లు స్పష్టం చేసింది.

"ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఇలాంటి హృదయపూర్వక కానుక పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. బలం, ఆశకు ఇది ప్రతీక. పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఈ ఊయల సూచిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ ఉప్సీ అప్పట్లో తన ఇన్​స్టాగ్రమ్​లో ఓ పోస్ట్‌ పెట్టారు.

జూన్​ 20న హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో 11 ఏళ్ల తర్వాత వీరికి సంతానం కలగడం వల్ల మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి.

  • KLIN KAARA KONIDELA ❤️

    Taken from the Lalitha Sahasranamam the name signifies a transformative, purifying energy that brings about a spiritual awakening

    A big big hug to our daughters grandparents 🤗🤗🤗🥰😍 pic.twitter.com/mIlTVDTGUA

    — Upasana Konidela (@upasanakonidela) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 1, 2023, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.