ETV Bharat / entertainment

సెన్సేషనల్​ సాంగ్​కు 'రకుల్​' డ్యాన్స్​.. నెటిజన్లు​ ఫిదా.. వీడియో వైరల్​ - రకుల్​ పసూరి సాంగ్​

Rakul Pasoori Song: రకుల్​ ప్రీత్​ సింగ్​.. తాజాగా చేసిన ఓ డ్యాన్స్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. సెన్సేషనల్​ పసూరి సాంగ్​కు అదిరే స్టెప్పులతో అలరించింది.

Rakul shakes leg for pasoori and her boy friend comments on it

author img

By

Published : Jun 24, 2022, 8:23 PM IST

Rakul Pasoori Song: స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా తన డ్యాన్స్‌తో నెట్టింటిని షేక్‌ చేస్తున్నారు. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్‌ డింపుల్‌ దగ్గర డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా యూట్యూబ్‌లో 20 కోట్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న సెన్సేషనల్‌ 'పసూరి' సాంగ్‌కు రకుల్‌ కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ఈ పాట తన ఫేవరెట్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. గంటల్లో లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీన్ని చూసిన సెలబ్రిటీలు.. 'ఓ మై గాడ్‌', 'చంపేశావ్‌ బేబీ' అని కామెంట్స్ పెడుతున్నారు.

రకుల్‌ ప్రియుడు, నటుడు జాకీ భగ్నానీ సైతం ఈ వైరల్‌ వీడియోపై స్పందించారు. ''డియర్‌ లవ్‌.. నాక్కూడా నేర్పించవా'' అని కామెంట్ పెట్టారు. 'ఎటాక్‌', 'రన్‌వే 34' చిత్రాలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రకుల్‌ ప్రస్తుతం 'డాక్టర్‌ జీ', 'థ్యాంక్‌ గాడ్‌', 'ఛత్రివాలీ' '31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌' సినిమాల్లో నటిస్తున్నారు. 'కొండపొలం' తర్వాత రకుల్‌ తెలుగులో ఏ ప్రాజెక్ట్‌కూ సంతకం చేయలేదు.

ఇవీ చూడండి: రణ్​బీర్​ డ్యుయల్​ రోల్​.. కళ్లు చెదిరే పోరాట దృశ్యాలతో 'షంషేరా'

సూపర్​స్టార్​ క్రేజ్​.. ఆ సినిమా కోసం ఏకంగా రూ.140 కోట్ల రెమ్యునరేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.