ETV Bharat / entertainment

జాన్వీ కపూర్​ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన స్టార్​ హీరో.. ధర ఎంతంటే? - Rajkummar Rao apartment

బాలీవుడ్​ హీరో రాజ్‌కుమార్ రావ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​దే అట. ఇంతకీ దాని ఖరీదు ఎంతంటే?

Rajkummar Rao buys janhvi kapoor's luxe apartment for a massive 44 Crore
జాన్వీ కపూర్​ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన స్టార్​ హీరో.. దాని ధర ఎంతంటే?
author img

By

Published : Jul 31, 2022, 9:43 AM IST

ముంబయిలో సెలబ్రిటీలతో వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండే ప్రాంతం జుహు. ఇది చాలా ఖరీదైన ఏరియా కూడా. ఇక్కడ ఇల్లు ఉండటాన్ని ఒక స్టేటస్​గా భావిస్తారు బాలీవుడ్​ తారలు. అందుకే ఖర్చుకు వెనకాడకుండా జుహు ప్రాంతంలో ఇల్లు కొనడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. తాజాగా అక్కడ ఇల్లు ఉన్న వారిలో జాబితాలోకి బాలీవుడ్‌ స్టార్​ హీరో రాజ్‌కుమార్ రావ్​ కూడా చేరిపోయారు. ఇటీవల ఆయన ఖరీదైన అపార్ట్‌మెంట్​ను కొనుగోలు చేశాడట.

ఇంటి కోసం రాజ్‌కుమార్ రావ్ రూ. 44 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ ఇంటిని.. బాలీవుడ్​ హాట్​ బ్యూటీ జాన్వీ కపూర్​ నుంచి కొనుగోలు చేశాడు రాజ్‌కుమార్ రావ్. అయితే ఇదే ఇంటిని 2020లో జాన్వీ రూ.39 కోట్లకు కొనుగోలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది. జులై 21 ఈ ఇంటి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ జరగ్గా.. రాజ్‌కుమార్‌ రూ. 2.19 కోట్ల స్టాంప్‌ డ్యూటీని చెల్లించాడు. ఇదే ఇంటి కోసం జాన్వీ 2020లో స్టాంప్ డ్యూటీ కోసం రూ.78 లక్షలు చెల్లించింది.

రాజ్‌కుమార్ రావు ప్రస్తుతం బాలీవుడ్​లో స్టార్​ హీరోగా వెలుగొందుతున్నాడు. ఏడాదికి ఆయన ఆదాయం రూ.8 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది కాకుండా.. అతను చాలా బ్రాండ్స్​కు అంబాసిడర్​గా ఉన్నాడు. రాజ్‌కుమార్, జాన్వీ క‌లిసి 'రూహి' చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఇదీ చదవండి: 'దుల్కర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇప్పుడూ అలానే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.