ETV Bharat / entertainment

Rajinikanth Himalayas : 4ఏళ్ల తర్వాత మళ్లీ హిమాలయాలకు రజనీ.. 'జైలర్​' రిలీజ్‌కు ముందే.. - రజనీ కాంత్ హిమాలయాలు

Rajinikanth Himalayas : నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు పయనమయ్యారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. జైలర్ సినిమా రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది.. చాలా గ్యాప్ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయారు. ఆ సంగతులు..

Rajinikanth Himalayas
Rajinikanth Himalayas
author img

By

Published : Aug 9, 2023, 10:18 AM IST

Updated : Aug 9, 2023, 11:41 AM IST

Rajinikanth Himalayas : రజనీకాంత్​.. ఈ పేరు తెరపై కనిపిస్తే చాలు.. ఈలలతో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే అభిమానులు.. రజనీని వెండితెరపై చూసి రెండేళ్లు అవుతోంది. దీంతో వారంతా జైలర్​ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు10న పాన్​ ఇండియా స్థాయిలో ఆ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్నా.. రజనీ హిమాలయాలకు పయణమయ్యారు.

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత..
Rajinikanth Meditation Himalayas : ఎన్ని ఉన్నా.. మనశ్శాంతి ఉండడం ముఖ్యం అని నమ్మే రజనీకాంత్.. తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు. ఎలాంటి పరిస్థితిలోనూ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లే రజనీకాంత్.. కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్ల నుంచి వెళ్లడం లేదు. అందుకే జైలర్ రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది చాలా గ్యాప్ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయారు.

డైరెక్టర్​ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్.. ప్రపంచవ్యాప్తంగా చాలా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి ఒక పక్కా కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ దర్శకుడితో చేతులు కలిపి రజనీ తెరకెక్కించిన సినిమా కాబట్టి దీనిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Jailer Movie Cast : జైలర్​లో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా కోసం ప్రతీ ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులను దింపారు దర్శకుడు నెల్సన్. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృ‌ష్ణ.. ఇలా స్క్రీన్ మొత్తాన్ని సీనియర్ నటీనటులతో నింపేశారు. మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, కోలీవుడ్ నుంచి రజినీకాంత్, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్.. ఇలా మూడు ఇండస్ట్రీల నుంచి మూడు పెద్ద యాక్టర్లు కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఇక జైలర్ విడుదల కారణంగా చెన్నై, బెంగుళూరులోని పలు ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించారు.

Upcoming Telugu Movies : మెగాస్టార్ X సూపర్​స్టార్​.. ఈ వారం కొత్త సినిమాల రిలీజ్​ లిస్ట్​ ఇదే!

Rajnikanth Jailer Shows : 'జైలర్'.. ఆ విషయంలో 'కేజీయఫ్‌'​, 'అవతార్'​నే దాటేసిందిగా..

Last Updated : Aug 9, 2023, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.