ETV Bharat / entertainment

Rajamouli New Film : 'మేడ్​ ఇన్​ ఇండియా'.. జక్కన్న బిగ్​ అనౌన్స్​మెంట్​ పూర్తి వివరాలివే - Rajamouli New Announcement on indian cinema

Rajamouli New Film : దర్శకుడు రాజమౌళి ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా పేరుతో ఇది తెరకెక్కుతోంది. ఆ సినిమా పూర్తి వివరాలివే..

Rajamouli New Film : అనుకున్నదే జరిగింది.. 'మేడ్​ ఇన్​ ఇండియా'.. జక్కన్న బిగ్​ అనౌన్స్​మెంట్​ ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 11:52 AM IST

Rajamouli New Film : 'బాహుబలి' సిరీస్​, 'ఆర్​ఆర్​ఆర్' చిత్రాలతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. అయితే ఆయన ఓ భారీ అనౌన్స్​మెంట్​ ఇవ్వనున్నారంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమాపై ఆయన బయోపిక్​ నిర్మిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడది నిజమైంది. అందరూ అనుకున్నట్టే.. ఆయన ఇండియన్ సినిమాను భారీగా స్థాయిలో ప్రజెంట్‌ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Rajamouli New Movie On Indian Cinema : అసలు ఇండియన్‌ సినిమా ఎక్కడ పుట్టింది. దానికి మూలం ఏంటి అనే కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 'మేడ్‌ ఇన్‌ ఇండియా' పేరుతో రానుంది. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. ఇది రాజమౌళి సమర్పణలో రానుంది. ఈ విషయాన్నే తెలుపుతూ దర్శకధీరుడు ట్వీట్‌ కూడా చేశారు.

"ఈ స్టోరీ విన్నగానే.. నేను ఎమోషనల్ అయ్యాను. బయోపిక్‌లను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. అలాంటిది ఇండియన్ సినిమాపై బయోపిక్‌ను చేయాలంటే అది మరింత సవాళ్లలో కూడుకున్న విషయం. ఈ చిత్ర యూనిట్‌ ఆ సవాళ్లకు రెడీగా ఉంది. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. " అని జక్కన్న రాసుకొచ్చారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతుంది. ఇండియన్ సినిమా బర్త్​ అండ్ రైజ్​(భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల) చూపించన్నారు. ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Mahesh Rajamouli Movie : ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం SSMB 29 వర్కింగ్ టైటిల్​తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్​ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్​ చెప్పారు. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుందట. మహేశ్ ఈ చిత్రంలో సరికొత్త లుక్​లో కనిపించనున్నారట.

  • When I first heard the narration, it moved me emotionally like nothing else.

    Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)

    With immense pride,
    Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ

    — rajamouli ss (@ssrajamouli) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mahesh Rajamouli Movie : జక్కన్న-మహేశ్​ మూవీ అదిరిపోయే అప్డేట్​ వచ్చిందోచ్​.. సినిమాలో ఆ హాలీవుడ్​ యాక్టర్స్​!

సినిమాల్లోకి జూనియర్​ ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. సితార పాపతో కలిసి.. నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.