ETV Bharat / entertainment

'పోర్నోగ్రఫీ కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర.. న్యాయం చేయండి ప్లీజ్​!'

author img

By

Published : Sep 30, 2022, 5:56 PM IST

పోర్నోగ్రఫీ కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనను వేధిస్తున్నారని నటి శిల్పాశెట్టి భర్త రాజ్​ కుంద్రా సీబీఐకి లేఖ రాశారు. తనకు న్యాయం జరిగేటట్లు చూడాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

Raj Kundra
రాజ్​ కుంద్రా

పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. సీబీఐకి లేఖ రాశారు. తనను ముంబయి క్రైమ్ బ్రాంచ్​లోని కొందరు అధికారులు.. పోర్నోగ్రపీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ విచారించి.. తనకు న్యాయం జరిగేటట్లు చూడాలని కోరారు. కాగా కొన్నాళ్ల క్రితమే రాజ్​ కుంద్రా బెయిల్​పై విడుదలయ్యారు.

పోర్నోగ్రఫీ కేసు విషయంలో న్యాయం చేయాలని ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశా. అభ్యంతరకరంగా సినిమాలు తీసినవారితో నాకెలాంటి సంబంధం లేదు. పోర్నోగ్రఫీ కేసులో దాఖలైన ఒర్జినల్​ ఛార్జ్​షీట్​లో నా పేరు లేకపోయినా క్రైమ్​ బ్రాంచ్ పోలీసులు నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.

--రాజ్ కుంద్రా

ఇదీ కేసు..
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు గతేడాది జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి: పాకిస్థాన్ యాక్టర్​తో స్టార్​ హీరోయిన్ రొమాన్స్​​.. వీడియో వైరల్​!

'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' తారలకు పాలాభిషేకం.. థియేటర్ల వద్ద కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.