ETV Bharat / entertainment

Pushpa: రష్యాలోనూ 'తగ్గేదేలే'.. దూసుకెళ్తున్న కలెక్షన్స్‌

ఇటీవలే రష్యాలో విడుదలైన అల్లుఅర్జున్​ 'పుష్ప' అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత కలెక్ట్​ చేసిందంటే?

Pushpa russia box office
Pushpa: రష్యాలోనూ 'తగ్గేదేలే'.. దూసుకెళ్తున్న కలెక్షన్స్‌
author img

By

Published : Jan 2, 2023, 5:47 PM IST

ఇటీవలే కాలంలో పలు భారతీయ చిత్రాలు.. విదేశాల్లోనూ మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఇప్పుడా జాబితాలో 'పుష్ప: ది రైజ్‌' వచ్చి చేరింది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రంతో.. 'పుష్ప' అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సన్సేషన్​ క్రియేట్‌ చేశారు బన్నీ. దీంతో ఇటీవల ఈ చిత్రాన్ని రష్యాలోనూ విడుదల చేశారు. చిత్ర బృందం సైతం అక్కడకు వెళ్లి ప్రచారం చేసింది. అయితే సినీ ట్రేడింగ్‌ వర్గాల అంచనా ప్రకారం.. అక్కడ కూడా 'పుష్ప' మంచి కలెక్షన్లను అందుుకుంటోంది. 25 రోజుల్లో ఈ చిత్రం 10 మిలియన్‌ రుబెల్స్‌ను వసూలు చేసింది. అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.13కోట్లు. ఇప్పటికీ రష్యన్‌ భాషలో 774 స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

ది రూల్​ చూడాల్సిందే.. పుష్పరాజ్‌ అనే యువకుడు ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి ఎర్ర చందనం సిండికేట్‌ నడిపే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా దాటాడు? అన్నది 'పార్ట్‌-1'లో చూపించారు. ఎర్రచందనం సిండికేట్‌ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత పుష్పరాజ్‌ ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది? శత్రువులను అణగదొక్కి తన ‘బ్రాండ్‌’ ఇమేజ్‌ను ఎలా పెంచాడు? తెలియాలంటే 'పుష్ప: ది రూల్‌' చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం ఇటీవల థాయిలాండ్‌ వెళ్లింది. అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తుండగా, ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

పుష్ప రికార్డులు..

  • 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావ', 'సామి సామి' పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్‌-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు, 6 బిలియన్‌ + వ్యూస్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి.
  • డిసెంబరు 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్‌) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప'రాజ్‌ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధికమంది వీక్షించిన, లైక్‌ చేసిన వీడియో 'పుష్ప'టీజర్‌ నిలిచింది.
  • ఓటీటీలోనూ 'పుష్ప' అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్‌ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది. 10మిలియన్‌+ ఇన్‌స్టా రీల్స్‌ క్రియేట్‌ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: మంచు తుపానులో గాయపడ్డ 'అవెంజర్స్​' స్టార్​​.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.