ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న భారీ చిత్రం 'ప్రాజెక్ట్-K'. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు గడిచింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక పోస్టర్ తప్ప అప్డేట్స్ ఏమీ లేవు. అయితే, ఈ సినిమా ఆలస్యం కావడంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అసలు 'ప్రాజెక్ట్-K' సాధారణ సినిమా లాంటిది కాదని వివరించారు. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇది పూర్తిగా కొత్త సినిమా అని అన్నారు. ఈ సినిమాను ఎలా చేయాలి అని ఆలోచించడానికే చాలా సమయం పడుతుందని వెల్లడించారు.
"ఇది చాలా కొత్త సినిమా. స్క్రిప్ట్ కూడా కొత్తది. దీని కోసం తయారుచేసిన ప్రపంచం.. టెక్నీషియన్స్ అంతా కొత్తగా ఉంటాయి. ఒకరకంగా ఈ సినిమా ఎలా చేయాలి అని ఆలోచించడానికే చాలా సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారుచేయాలి. 'మహానటి' సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం. ఈ సినిమాకు అలా కుదరదు. అన్నీ మేం తయారుచేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా సినిమా కొత్తగా అయితే ఉంటుంది" అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
-
“ #ProjectK Cinema & Script is New, Build-up chese World, Cars, Technicians. Everything is New” ! 💥 — @nagashwin7 . #Prabhas . #DeepikaPadukone pic.twitter.com/uG933fGI6x
— 🏝️ (@charanvicky_) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">“ #ProjectK Cinema & Script is New, Build-up chese World, Cars, Technicians. Everything is New” ! 💥 — @nagashwin7 . #Prabhas . #DeepikaPadukone pic.twitter.com/uG933fGI6x
— 🏝️ (@charanvicky_) November 18, 2022“ #ProjectK Cinema & Script is New, Build-up chese World, Cars, Technicians. Everything is New” ! 💥 — @nagashwin7 . #Prabhas . #DeepikaPadukone pic.twitter.com/uG933fGI6x
— 🏝️ (@charanvicky_) November 18, 2022
నాగ్ అశ్విన్ చెప్పిన ఈ విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సినిమా నిర్మాణానికి అవసరమయ్యే ప్రతిదాన్నీ సొంతంగా తయారుచేసుకోవాలి అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం కెమికల్ ఇంజినీర్లను తీసుకున్నారట. ఇంకొంతమంది కొత్త టెక్నీషియన్లు ఈ సినిమా నిర్మాణం కోసం తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు.