హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆగిపోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. రద్దీ సమయాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే విషయానికొస్తే.. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనవంతు సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును పక్కకు తీసి, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.
తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్డదిడ్డంగా వచ్చిన వాహనదారులను ఆయన కంట్రోల్ చేస్తూ అందులో కనిపించారు. ఆయనకు సాయంగా ఒకరిద్దరు సామాన్యులు కూడా జత కలిశారు. ఇంకేముందు కొద్ది సమయంలోనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది. సురేశ్‌బాబు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీ అయి కూడా సమాజాన్ని, తోటి మనుషులను తిట్టుకోకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేశారంటూ సందేశాలు పెడుతున్నారు.
ఇక సినిమాలు విషయానికి వస్తే.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గత కొంతకాలంగా ఆయన సినిమాలు తీయటం తగ్గించారు. 2023లో తమ బ్యానర్ నుంచి పెద్ద చిత్రాలతో పాటు, పలు చిన్న సినిమాలు కూడా వస్తాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేశ్‌బాబు చెప్పారు. మరోవైపు ఈ సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో వివాదం నెలకొనడంతో నిర్మాత సురేష్‌బాబు మరో నిర్మాత దిల్ రాజుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. భాషా ప్రాతిపదిక కాకుండా చివరకు మంచి సినిమానే మాట్లాడుతుందని, సంక్రాంతికి అన్ని సినిమాలు విడుదలై విజయం సాధిస్తాయని సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.