ETV Bharat / entertainment

SSMB 28: త్రివిక్రమ్ ప్లాన్ ఛేంజ్​.. ​'కేజీయఫ్​'​ రేంజ్​లో యాక్షన్​ సీక్వెన్స్ చేసి కూడా.. ​​ - SSMB28 మూవీ అప్డేట్​

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 గురించి నిర్మాత నాగవంశీ అప్డేట్స్​ ఇచ్చారు. ఆ సంగతులు..

Nagavamsi
'కేజీయఫ్​'​ ఫైట్​ మాస్టర్స్​తో మహేశ్ యాక్షన్ ఎపిసోడ్​..
author img

By

Published : Feb 15, 2023, 3:49 PM IST

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో SSMB28 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం వల్ల దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శర‌వేగంగా జ‌రుగుతోంది. గ‌త చిత్రాల‌కు భిన్నంగా కొత్త స‌బ్జెక్ట్‌తో త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఈ సినిమాపై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు.

"ఈ సినిమా అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నానంటే.. ఇది విడుదలైన ప్రతిచోట సూపర్‌ హిట్‌ అవుతుంది. రాజమౌళి గారి సినిమా నంబర్స్‌కు దగ్గరగా వెళ్తుంది. మేము 'అల వైకుంఠపురములో' సినిమా అప్పుడు కూడా రాజమౌళి నంబర్స్‌ దాకా వెళ్లాం. ఇక మహేశ్‌ - త్రివిక్రమ్‌ల సినిమా మా అంచనాలను చేరుకుంటుందని ఆశిస్తున్నా" అని నాగవంశీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కేజీయఫ్​ ఫైట్ మాస్ట‌ర్స్ సార‌థ్యంలో మ‌హేశ్​బాబుపై ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను త్రివిక్రమ్ చిత్రీక‌రించార‌ని నాగ‌వంశీ అన్నారు. కానీ ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ అవుట్‌పుట్ విష‌యంలో త్రివిక్ర‌మ్‌తో పాటు తాము ఎవ‌రికి సంతృప్తి క‌ల‌గ‌లేద‌ని, ఆ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశామ‌ని అన్నారు. సినిమాలో దానిని ఉప‌యోగించ‌డం లేద‌ని పేర్కొన్నారు.

ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రానున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఆగ‌స్ట్ 11కు ఈ సినిమాను వాయిదా వేశారు.

ఇదీ చూడండి: కూతురికి పెళ్లి చేసుకోవద్దని చెప్పేశా.. ఆస్తి మొత్తం సున్నా.. నేనింతే : జగపతి బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.