టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన ఓ సినిమా వల్ల తాను డబ్బులు పోగొట్టుకున్నానని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 'స్వాతిముత్యం' ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విశేషాలు తెలిపారు.
"సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై 2019లో వచ్చిన 'జెర్సీ' మంచి హిట్ అందుకుంది. ఇదే ఏడాదిలో మా బ్యానర్ నుంచి వచ్చిన 'రణరంగం' ఫ్లాప్ అయ్యింది. అయితే.. ఈ చిత్రాన్ని మేము ఎంతో పాజిటివ్‌గా ప్రారంభించాం. తప్పకుండా విజయం అందుకుంటుందనుకున్నాం. కానీ, సినిమా విడుదలయ్యాక మేము అనవసరంగా ప్రయోగం చేశామనిపించింది. డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. ఈ సినిమా నాకొక పాఠం నేర్పించింది. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే మా బాబాయ్ రిస్క్ ఎందుకు.. వద్దని చెప్పారు. ఆయన మాట వినకుండా సినిమా చేశాం. ఇప్పుడు బాబాయ్ ఏదైనా వద్దని చెబితే.. మేము ఆగిపోతున్నాం" అని నాగవంశీ తెలిపారు.
అనంతరం ఆయన 'ఎస్ఎస్ఎంబీ 28' ప్రాజెక్ట్‌పై స్పందించారు. "త్రివిక్రమ్ - మహేశ్‌బాబు కాంబినేషన్లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సూపర్‌హిట్స్ అందుకున్నాయి. దీంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానులు మహేశ్‌ని ఎలా చూడాలని అనుకుంటున్నారో.. ఈ సినిమాలో తప్పకుండా అలాగే చూస్తారు" అని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: God Father: 'గాడ్ ఫాదర్' నుంచి మరో సర్ప్రైజ్.. టైటిల్ సాంగ్ రిలీజ్
Boxoffice war: ఈ వారమే గాడ్‌ఫాదర్-ఘోస్ట్.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?