ETV Bharat / entertainment

నాగచైతన్య మూవీలో వంటలక్క.. ఈ సినిమాతోనే వెండితెర అరంగేట్రం - నాగ చైతన్య ప్రేమీ విశ్వనాథ్

నాగచైతన్య సినిమాలో ఓ ప్రముఖ బుల్లితెర నటి సందడి చేయబోతోంది. ఈ మేరకు సీరియల్​ నటిని సినిమాలోకి తీసుకుంటూ తీసుకుంటూ చిత్ర యూనిట్​ సోషల్​ మీడియా వేదికగా ప్రకటించింది. బుల్లితెర భామ ఎవరంటే..

naga chaitanya 22nd film
naga chaitanya 22nd film
author img

By

Published : Oct 14, 2022, 8:20 PM IST

అక్కినేని వారి అబ్బాయి నాగచైతన్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకట్​ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చైతన్య భారీగానే ప్లాన్​ చేశారు. ఇందులో నాగచైతన్యతో కృతి శెట్టి రొమాన్స్​ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్​లో​ ప్రారంభమైంది. కానీ ఇంకా పేరు ఖరారు చేయలేదు. #ఎన్​సీ22 పేరుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల 'లాల్​ సింగ్​ చద్దా', 'థ్యాంక్యూ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయాయి. అయితే నాగచైతన్య మరో మూవీలో నటించే నటీనటుల గురించి అప్డేట్​ ఇచ్చింది చిత్ర యూనిట్.

naga chaitanya 22nd film
కార్తీకదీపం వంటలక్క

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్​ కూడా అదే స్థాయిలో ఉంటుందని సినీ వర్గాల సమాచారం. అయితే తాజా అప్డేట్​లో నటీనటుల పేర్లు వెల్లడించింది చిత్ర యూనిట్​. జాతీయ అవార్డు పొందిన ప్రముఖ నటి ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది. ఆమెతో పాటు శరత్​ కుమార్, అరవింద్​ స్వామి, వెన్నెల కిషోర్, తమిళ నటుడు ప్రేమ్​జీ అమరేన్, సంపత్​ రాజ్, జీవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

naga chaitanya 22nd film
#ఎన్​సీ22 నటీనటులు

వీళ్లే కాకుండా మరో ప్రముఖ సీరియల్ తార కూడా ఇందులో నటించనుంది. మొదటి సారి వెండితెర అరంగేట్రం చేస్తోంది ఈ బుల్లితెర బామ. ఆమెనే తెలుగు బుల్లితెరపై మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్. ఇంతకీ ఈ ప్రేమీ విశ్వనాథ్​ అంటే ఎవరంటారా? అదేనండీ మన 'కార్తీక దీపం' సీరియల్​లో వచ్చే వంటలక్క. శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్​ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా, అతడి కుమారుడు యువన్​ శంకర్​ రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

ఇవీ చదవండి: డేటింగ్​లో​ సారా.. శుభ్​మన్​ జంట! మరోసారి కెమెరాకు.. నెట్టింట వీడియో వైరల్​

కర్వాచౌత్ వేడుకల్లో సినీ తారల సందడి.. కత్రిన, మౌనీరాయ్​ లుక్స్​ సూపర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.